Drink and Drive : తాగి వాహనం నడిపితే కాలేజీలకు లేఖలు…విద్యార్థులకు సీపీ సజ్జనార్ వార్నింగ్…

మందుబాబులకు గుణపాఠం చెప్పడానికి ఏకంగా సైబరాబాద్‌ సీపీ  సజ్జనార్ రంగంలోకి దిగారు. రోడ్డుపైనే కౌన్సిలింగ్ ఇచ్చి..తాగి బండి నడపడం తప్పు కదా అని ప్రశ్నించారు.

Drink and Drive : తాగి వాహనం నడిపితే కాలేజీలకు లేఖలు...విద్యార్థులకు సీపీ సజ్జనార్ వార్నింగ్...
Follow us

|

Updated on: Dec 31, 2020 | 7:06 PM

మందుబాబులకు గుణపాఠం చెప్పడానికి ఏకంగా సైబరాబాద్‌ సీపీ  సజ్జనార్ రంగంలోకి దిగారు. రోడ్డుపైనే కౌన్సిలింగ్ ఇచ్చి..తాగి బండి నడపడం తప్పు కదా అని ప్రశ్నించారు. తాగి డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణమయ్యే వారు టెర్రరిస్టులతో సమానమని పేర్కొన్నారు. తాగుబోతులు డ్రైవింగ్ చేయడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఉద్యోగులు తాగి వాహనం నడిపితే..వారి ఆఫీసులకు లేఖ రాస్తామని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థులపై కాలేజీలకు లేఖలు పంపుతామని..తాగి వాహనం నడిపి బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు. కొత్త సంవత్సరం వేడుకలకు తాను వ్యక్తిగతంగా దూరంగా ఉంటున్నట్లు సజ్జనార్ తెలిపారు. గత సంవత్సర కాలం నుంచి గమనిస్తే..30 నుంచి 40 శాతం ప్రమాదాలకు కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ అని వివరించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేవారంతా..తాగి వాహనం నడపనని ప్రమాణం చేయాలని కోరారు. తాగి వాహనం నడిపితే ఎంత ప్రమాదమో తెలిసి కూడా..అలా చేసేవారిని టెర్రరిస్టులు కాకుండా..ఏమని పిలవాలో చెప్పాలన్నారు.

Also Read : 

Reliance Jio : వినియోగదారులకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్.. 2021 జనవరి 1 నుంచి అన్ని కాల్స్ ఉచితం

 Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..

Ap food processing policy : ఏపీలో నూతన ఆహారశుద్ధి విధానం అమల్లోకి.. రైతు భరోసా కేంద్రాలే ప్రాసెసింగ్ కేంద్రాలు !

Latest Articles
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..