అమ్మగా మారి బిడ్డకు పాలు పట్టించిన సీఈఓ.. ఫొటో వైరల్

స్థానం ఎంత గొప్పదైనా, తాము ఉన్నది ఏ పొజిషన్‌లోనైనా.. తమ పిల్లల దగ్గరకు వచ్చేసరికి అన్నీ మర్చిపోతారు తల్లిదండ్రులు. ముఖ్యంగా తమ పిల్లల ఆలనపాలన కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ సంస్థ సీఈవో తన బిడ్డకు పాలు పట్టిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీన్ని చూస్తోన్న నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ పెడుతున్నారు. వివరాల్లోకి వెల్తే.. ఢిల్లీకి సమీపాన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నొయిడా నగరానికి […]

అమ్మగా మారి బిడ్డకు పాలు పట్టించిన సీఈఓ.. ఫొటో వైరల్

Edited By:

Updated on: Jul 19, 2019 | 4:28 PM

స్థానం ఎంత గొప్పదైనా, తాము ఉన్నది ఏ పొజిషన్‌లోనైనా.. తమ పిల్లల దగ్గరకు వచ్చేసరికి అన్నీ మర్చిపోతారు తల్లిదండ్రులు. ముఖ్యంగా తమ పిల్లల ఆలనపాలన కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ సంస్థ సీఈవో తన బిడ్డకు పాలు పట్టిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీన్ని చూస్తోన్న నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ పెడుతున్నారు.

వివరాల్లోకి వెల్తే.. ఢిల్లీకి సమీపాన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నొయిడా నగరానికి చెందిన అశుతోష్.. హర్బోలా బుజోకా అనే కంపెనీకి సీఈవోగా చేస్తున్నారు. ఇటీవల తన కార్యాలయం గదిలోనే కుమార్తె శ్లోకాకు ఆయన పాలు పట్టిస్తుండగా.. సహద్యోగి ఒకరు ఫొటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

మా సీఈవో అశుతోష్.. నిజమైన తండ్రిగా ఆయన ఏం చేయాలో అదే చేస్తున్నారు. వృత్తిపరంగా ఎంతో నిబద్ధతతో వ్యవహరించే అశుతోష్.. తన బిడ్డ విషయంలోనూ అదే నిబద్ధతను కనబర్చి నిజమైన తండ్రి ఎలా ఉండాలో చెప్పకనే చెప్పారు. హ్యాట్సాఫ్ టు హిమ్ అంటూ కామెంట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడు రియల్ సూపర్‌స్టార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.