
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, షాలిని పెళ్లి జులై 26న (ఆదివారం) సాయంత్రం జరగనుందనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే నితిన్ తనకు పెళ్లి అని చూడకుండా తనను టార్చర్ పెడుతున్నారంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఇంతకీ నితిన్‌ను టార్చర్ పెట్టిందెవరో తెలుసా? రంగ్ దే యూనిట్. కొత్త పెళ్లి కొడుకు నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకి దర్మకత్వం వహిస్తుండగా.. పీడీపీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మైంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఇక నితిన్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా గిఫ్ట్‌ను ఇచ్చేందుకు రెడీ అవుతోంది రంగ్ దే మూవీ యూనిట్. ‘నాన్నా.. తను నవ్వుతుంది నేను కట్టలేను నాన్నా’.. అంటూ నితిన్ ఎంతో క్యూట్‌గా చెబుతున్న డైలాగ్ ఉన్న టీజర్‌ను రంగ్ దే యూనిట్ రిలీజ్ చేసింది.పెళ్లి జరిగే సమయంలోనూ ఎంజాయ్ చేయనివ్వకుండా తమ డైరెక్టర్.. ఈ సమయంలో కూడా టార్చర్ పెడుతున్నారని ఫన్నీగా చెప్పాడు నితిన్. అయితే అదే వీడియోలో డైరెక్టర్ అట్లూరి మాట్లాడుతూ.. పెళ్లి టైంలో నితిన్ ఎంత టెన్షన్‌గా ఉంటారో నాకు తెలుసు. అయినా సరే సినిమా పట్ల నితిన్‌కి ఉన్న కమిట్‌మెంట్‌కి హ్యాట్సాఫ్ అంటూ చెప్పారు. కాగా సినిమా నితిన్ అభిమానులకు, సినీ ప్రేమికులకు ఎప్పటికీ గుర్తిండిపోయేలా నేడు సాయంత్రం 4.05 నిమిషాలకు పెళ్లి గిఫ్ట్‌ను రివీల్ చేయనుంది రంగ్ దే మూవీ టీమ్.
Read More: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మెగాస్టార్, పవర్ స్టార్