
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది.
తాజాగా ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్మకుడు శివ నిర్వాణ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమం తలపెట్టిన సంతోష్ కుమార్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఛాలెంజ్‌ని మరితం ముందుకు తీసుకెళ్లాలంటూ సందీప్ రెడ్డి వంగా, సుధీర్ వర్మ, హరీష్ పెద్ది, సాహు గరపాటిలని నామినేట్ చేశారు.
Read More:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి.. ఈ రోజు ఎన్ని కేసులంటే?