David Warner Begins Cake Fight : తప్పకా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది హైదరబాద్. ఈ మ్యాచ్‌లో 88 పరుగులతో ఢిల్లీని ఓడించి సత్తా చాటిన సంగతి తెలిసిందే. కెప్టెన్ డేవిడ్ వార్నర్(66), వృద్ధిమాన్ సాహా(87) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో లీగ్‌లో తమ రెండో అత్యధిక స్కోరును రికార్డు చేసింది వార్నర్ సేన.
మంగళవారం నాటి ఈ అపూర్వ విజయంతో హైదరాబాద్ జట్టు పండుగ చేసుకుంది. దీనికి తోడు జట్టు సారథి డేవిడ్ వార్నర్ పుట్టిన రోజు కూడా కావడంతో జట్టు సంబరాల్లో మునిగిపోయింది. ఈ డబుల్ ధమాకా కారణంగా డ్రెస్సింగ్‌రూంలో పెద్ద ఎత్తున సందడి వాతావరణం కనిపించింది.
ఇందుకు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘గత రాత్రి కీలక మ్యాచ్‌లో గెలిచిన తర్వాత డ్రెస్సింగ్‌రూంలో ఏం జరిగిందో చూడండి ట్వీట్ చేసింది. కేక్ ఫైట్‌ను కూడా అస్సలు మిస్పవకండి’’అంటూ ఆరెంజ్ కలర్‌లో ఉన్న హార్ట్ ఎమోజీని జతచేసింది.
Watch what happened in the dressing room after our crucial game last night ?
Don’t miss the cake rituals too, #OrangeArmy ?#SRHvDC #KeepRising #Dream11IPL pic.twitter.com/3802fTzpjr
— SunRisers Hyderabad (@SunRisers) October 28, 2020
ఇక జట్టు సభ్యులు వార్నర్ ముఖాన్ని కేక్‌తో నింపేశారు. ఆ తర్వాత వార్నర్ అందరి మీదకు కేక్ విసురుతూ, బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ వద్దకు పరుగెత్తుకువెళ్లి అతడి ముఖానికి కేక్ పూశాడు. మిగతా ఆటగాళ్లంతా ఈ సంతోష క్షణాలను సెల్‌ఫోన్‌లో బంధిస్తూ సందడి చేశారు. ఈ వీడియో ఆరెంజ్ ఆర్మీ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేయగా.. సమిష్టి వైఫల్యంతో ఢిల్లీ జట్టు భారీ ఓటమిని మూటగట్టుకుంది.