Cyber Alert: రోజుకు 250 మందిని టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు, లిస్టులో మీరు లేకుండా ఉండాలంటే..!

రోజు రోజుకి పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో అధిక సంఖ్యలో చదువుకున్న వ్యక్తులే బాధితులుగా ఉంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి వస్తున్న కాల్స్ ను బట్టి వారి క్వాలిఫికేషన్లను నమోదు చేశారు పోలీసులు. వీరిలో ఎక్కువ సంఖ్యలో గ్రాడ్యుయేట్లే బాధితులుగా ఉన్నట్లు తెలిసింది. చదువుకున్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ ముఠాలు యధేచ్ఛగా వారికి తెలియకుండానే వారి మొబైల్ ఫోన్లో నుండి డబ్బులు కాజేస్తున్నారు.

Cyber Alert: రోజుకు 250 మందిని టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు, లిస్టులో మీరు లేకుండా ఉండాలంటే..!
Cyber Frauds
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 10, 2024 | 6:32 PM

రోజు రోజుకి పెరిగిపోతున్న సైబర్ నేరాల్లో అధిక సంఖ్యలో చదువుకున్న వ్యక్తులే బాధితులుగా ఉంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి వస్తున్న కాల్స్ ను బట్టి వారి క్వాలిఫికేషన్లను నమోదు చేశారు పోలీసులు. వీరిలో ఎక్కువ సంఖ్యలో గ్రాడ్యుయేట్లే బాధితులుగా ఉన్నట్లు తెలిసింది. చదువుకున్న వ్యక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ ముఠాలు యధేచ్ఛగా వారికి తెలియకుండానే వారి మొబైల్ ఫోన్లో నుండి డబ్బులు కాజేస్తున్నారు. గడచిన ఆరు నెలల వ్యవధి డేటాను పరిశీలిస్తే సైబర్ బారిన పడిన వారిలో సుమారు 38,000 మంది గ్రాడ్యుయేట్లు బాధితులుగా ఉన్నారు. వీరిలో నిరక్షరాశులు కేవలం 800 మంది మాత్రమే బాధితులుగా ఉన్నారు.

నిరంతరం సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న బాధితుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సైబర్ కంట్రోల్ రూమ్ కు 1930 ద్వారా రోజుకు సుమారు 250 కాల్స్ వస్తున్నాయి.. వీరిలో ప్రైవేట్ ఉద్యోగులే అధిక సంఖ్యలో మోసపోతున్నారు. అన్ని తెలిసి కొన్ని చిన్న పొరపాట్ల వల్ల సంబంధంలేని లింకులు క్లిక్ చేస్తూ మోసపోతున్నారు. ఆరు నెలల వ్యవధిలో సుమారు 30 వేలకు పైగా ప్రైవేటు ఉద్యోగులు తెలంగాణలో సైబర్ నేరగాళ్ల బారినపడి తమ డబ్బులు పోగొట్టుకున్నారు.

స్మార్ట్ ఫోన్లు వాడకం ఎక్కువగా ప్రైవేట్ ఉద్యోగులు యువతనే చేస్తుండటంతో వీరినే టార్గెట్ చేసుకున్న సైబర్ ముఠాలు యధేచ్ఛగా తమ టార్గెట్‌ను రీచ్ అవుతున్నారు. వృద్ధులు లేదా రైతులు తక్కువ సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లను వాడుతారు కాబట్టి వారు సైబర్ నేరగాల చేతిలో తక్కువగా మోసపోతున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ సైబర్ మోసాలు జరుగుతున్న కమిషనరేట్లను పరిశీలిస్తే, మొదటి స్థానంలో ఉంది ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న సైబరాబాద్ ప్రాంతం . ఇక్కడ లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తుంటారు. సైబర్ మూసాలపై నిరంతర అవగాహన వీరికి ఉన్నప్పటికీ తెలిసి తెలియక చేస్తున్న చిన్న పొరపాటు వల్ల బాధ్యతులుగా మారిపోతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుండి వచ్చిన ఫిర్యాదుల సంఖ్య 30 వేలకు పైబడి ఉంది. రెండో స్థానంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న 24 వేల మంది సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ