ఆర్థిక ప్రగతికి 12 కీలక నిర్ణయాలు.. వెల్లడించిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, జీఎస్టీ వసూళ్ళలో గణనీయంగా పెరుగుదల

ఆర్థిక ప్రగతికి 12 కీలక నిర్ణయాలు.. వెల్లడించిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, జీఎస్టీ వసూళ్ళలో గణనీయంగా పెరుగుదల

కరోనా సంక్షోభంతో నెమ్మదించిన ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే లక్ష్యంతో కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. 'ఆత్మ నిర్భర్​ భారత్'​ ఉద్దీపన చర్యల్లో భాగంగా పలు కీలక నిర్ణయాలను వెల్లడించింది. మూడో విడత ఉద్దీపన చర్యల్లో భాగంగా 12 కీలక నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Rajesh Sharma

|

Nov 12, 2020 | 8:11 PM

Crucial decisions for economy boost: కరోనా సంక్షోభంతో నెమ్మదించిన ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే లక్ష్యంతో కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. ‘ఆత్మ నిర్భర్​ భారత్’​ ఉద్దీపన చర్యల్లో భాగంగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచి, ఆర్థిక కార్యకలాపాలు జోరందుకునేలా చేసేందుకు ఉద్దేశించిన నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్ సంయుక్తంగా వెల్లడించారు. ఆర్మ నిర్బర్ భారత్ కింద ఉద్దీపన చర్యల 3వ విడతలో భాగంగా 12 కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

ఆత్మ నిర్భర్​ భారత్​ రోజ్​గార్ ప్రోత్సాహన్​​ యోజన

కొత్త ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యం రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజనను ప్రకటించారు. ఈపీఎఫ్​ఐ పరిధిలోని సంస్థ కొత్త ఉద్యోగిని (గతంలో పీఎఫ్​లో చేరనివారు లేక ఉద్యోగం కోల్పోయిన వారు) చేర్చుకుంటే… సంస్థకు, ఉద్యోగికి ప్రత్యేక లబ్ధి చేకూర్చనున్నారు. అక్టోబర్​ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ఆర్థిక మంత్రి వివరించారు.

ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని గణాంక సహితంగా వివరించారు నిర్మల సీతారామన్. వేర్వేరు రంగాల్లో సాధించిన వృద్ధి గణాంకాలను వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోనే పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఏడాదికేడాది జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయన్నారు. అక్టోబరులో రూ.లక్షా 5 వేల కోట్ల జీఎస్టీ వసూళ్లు రాగా.. ఆ మొత్తం 2019 అక్టోబర్ కంటే పది శాతం అధికమని తెలిపారు. ఏప్రిల్-ఆగస్టు వరకు 35.37 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని, గతేడాదితో పోల్చుకుంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 13 శాతం పెరిగాయని చెప్పారు నిర్మల.

విదేశీ మారకనిల్వలు 567 బిలియన్ డాలర్లకు పెరిగాయని, స్టాక్‌మార్కెట్లు రికార్డుస్థాయికి ఎగబాకాయని, ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లోకి వచ్చిందని నిర్మలా సీతారామన్ వివరించారు. 68.6 కోట్లమంది లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం కలిగిందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్​లో భాగంగా ఇప్పటికే రెండు దఫాలుగా చేపట్టిన ఉద్దీపన చర్యలు సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి వివరించారు.

ALSO READ: ‘చేయూత‘కు 151 కోట్లు.. మంజూరు చేసిన సర్కార్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu