దేశ‌మంతటా నిజాముద్దీన్ ఫియ‌ర్…సంఖ్య వింటే వెన్నులో వ‌ణుకు పుడుతోంది

పెళ్లిళ్లు లేవు.. మీటింగ్‌లు లేవు.. గాదరింగ్‌లు లేవు.. ఈ కండిషన్లన్నీ మార్చి 22 జనతా కర్ఫ్యూ నుంచి మొదలయ్యాయి. కానీ ఇదేదో పది రోజుల ముందు నుంచి మొదలు పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఎందుకంటే దేశంలో వ్యాపిస్తున్న కేసులు. ఇప్పటికి నమోదైన 1251 పాజిటివ్‌ కేసుల్లో ఎనిమిది వందలకు పైగా ఒకే ఒక్క పబ్లిక్‌ గాదరింగ్‌కు కేంద్రంగా వచ్చినవే! మార్చి 13 నుంచి 17 మధ్య ఢిల్లీలో భాగమైన నిజాముద్దీన్‌లో ఓ మతానికి సంబంధించిన […]

దేశ‌మంతటా నిజాముద్దీన్ ఫియ‌ర్...సంఖ్య వింటే వెన్నులో వ‌ణుకు పుడుతోంది
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 31, 2020 | 5:39 PM

పెళ్లిళ్లు లేవు.. మీటింగ్‌లు లేవు.. గాదరింగ్‌లు లేవు.. ఈ కండిషన్లన్నీ మార్చి 22 జనతా కర్ఫ్యూ నుంచి మొదలయ్యాయి. కానీ ఇదేదో పది రోజుల ముందు నుంచి మొదలు పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఎందుకంటే దేశంలో వ్యాపిస్తున్న కేసులు. ఇప్పటికి నమోదైన 1251 పాజిటివ్‌ కేసుల్లో ఎనిమిది వందలకు పైగా ఒకే ఒక్క పబ్లిక్‌ గాదరింగ్‌కు కేంద్రంగా వచ్చినవే! మార్చి 13 నుంచి 17 మధ్య ఢిల్లీలో భాగమైన నిజాముద్దీన్‌లో ఓ మతానికి సంబంధించిన ప్రార్థనలు జరిగాయి. ఈ మీటింగ్‌కు దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మంది పాల్గొన్నారు. వీళ్లల్లో ఎంతమందికి కరోనా ఉందో ..వీళ్లు వాళ్ల ఊళ్లకు వెళ్లి ఎంతమందిని కలిశారో లెక్క తేలడం లేదు. కారణం ఏమిటంటే ఇదే సమావేశానికి 16 దేశాల నుంచి దాదాపు మూడు వందల మంది మత పెద్దలు వచ్చారు. విచిత్రమేమిటంటే వచ్చినవారిలో చాలా మంది వీసా రూల్స్‌ బ్రేక్‌ చేసి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రాథమికంగా ఉన్న లెక్కల ప్రకారం నేపాల్‌ నుంచి 19 మంది, మలేషియా నుంచి 20 మంది, అఫ్గనిస్తాన్‌ నుంచి ఒకరు, మయన్మార్‌ నుంచి 33 మంది, అల్జీరియా నుంచి ఒకరు, కిర్గిస్తాన్‌ నుంచి 28 మంది, ఇండోనేషియా నుంచి 72 మంది, థాయ్‌లాండ్‌ నుంచి 71 మంది, శ్రీలంక నుంచి 34 మంది, బంగ్లాదేశ్‌ నుంచి 19 మంది, ఇంగ్లాండ్‌ నుంచి ముగ్గురు, సింగపూర్‌ నుంచి ఒకరు, ఫిజీ నుంచి నలుగురు, ఫ్రాన్స్‌ నుంచి ఒకరు, కువైట్‌ నుంచి ఇద్దరు వచ్చారు. వీరిలో నూటికి 90 శాతం మందికి కరోనా ఉన్నట్టు అనుమానం. పైగా ఇండోనేషియా నుంచి వచ్చిన బ్యాచ్‌ పని అయిపోగానే వెళ్లిపోకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలలో తిరిగారు. అలా రామగుండం, కరీంనగర్‌, సికింద్రాబాద్‌కు వచ్చిన వారు 13 మంది. వాళ్ల కారణంగానే కరీంనగర్‌లో కరోనా వైరస్‌ వ్యాపించింది. ఈ ఒక్క మత ప్రార్థనల ఎఫెక్టే దేశమంతటా భారీగా కనిపిస్తోంది. అసోం నుంచి రెండువందల మంది అక్కడికి వెళ్లారు. ఇప్పటివరకు కరోనా వైరస్‌ సోకని అండమాన్‌ దీవుల్లోనూ ఆ వైరస్‌ వ్యాపించిందంటే అందుకు కారణం నిజాముద్దీనే! అక్కడ కూడా ఉన్నపళంగా తొమ్మిది కేసులు తెరమీదకు వచ్చాయి. ఇక ఇటు తమిళనాడుకు కూడా కరోనా ఎఫెక్ట్‌ గట్టిగా ఉండబోతుంది. ఎందుకంటే దాదాపు 15 వందల మంది ఆ సమావేశాలకు హాజరయ్యారు. ఆ రాష్ట్రంలోని 74 మందిలో 16 మంది ఢిల్లీ వెళ్లి వచ్చినవారే. మరి 15 వందల మందిలో వారి స్టేటస్‌ ఏమిటన్నది తేలాల్సి ఉంది.

ప్రముఖ దినపత్రిక 'హిందీ మిలాప్‌' ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ కన్నుమూత
ప్రముఖ దినపత్రిక 'హిందీ మిలాప్‌' ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ కన్నుమూత
డబుల్ మీనింగ్ సాంగ్ అని బ్యాన్ చేశారు.. కట్ చేస్తే..
డబుల్ మీనింగ్ సాంగ్ అని బ్యాన్ చేశారు.. కట్ చేస్తే..
లోక్‌సభ ఎన్నికల బరిలోకి ముంబై మాజీ పోలీస్ కమిషనర్..?
లోక్‌సభ ఎన్నికల బరిలోకి ముంబై మాజీ పోలీస్ కమిషనర్..?
చెత్త ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా ఆల్ రౌండర్ ఔట్?
చెత్త ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా ఆల్ రౌండర్ ఔట్?
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్