Coronavirus outbreak: చైనా వెలుపల.. 17రెట్ల వేగంతో కరోనా విజృంభణ!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనావైరస్‌ చైనాకు వెలుపల 17రెట్ల వేగంతో వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అరికట్టాలని

Coronavirus outbreak: చైనా వెలుపల.. 17రెట్ల వేగంతో కరోనా విజృంభణ!
Follow us

| Edited By:

Updated on: Mar 06, 2020 | 4:35 PM

Coronavirus outbreak: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనావైరస్‌ చైనాకు వెలుపల 17రెట్ల వేగంతో వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అరికట్టాలని ప్రపంచదేశాలకు సూచించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3300మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 98వేల మంది దీని బారినపడ్డారు. కేవలం చైనాలోనే 3042మంది చనిపోగా తాజాగా మరో 30మరణాలు సంభవించాయి.

కాగా.. ఇప్పటివరకు భారత్‌లో నమోదైన కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 31కి చేరింది. ఈ సమయంలోనే దేశంలో కొన్నిప్రాంతాల్లో వాతావరణం చల్లబడడంతో కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుందనే ఆందోళన ప్రజల్లో ఎక్కువైంది. అయితే ఇలాంటి వాతావరణ మార్పులకు, కరోనా వ్యాప్తి విజృంభనకు సంబంధంలేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్‌) వెల్లడించింది. వాతావరణంలోని మార్పులు కరోనా వైరస్‌ని ప్రభావితం చేయవని తెలిపింది.

యూఎన్‌ఓ (ఐక్యరాజ్యసమితి)లో పనిచేస్తున్న బ్రిటన్‌కు చెందిన 33ఏళ్ల మహిళా ఉద్యోగికి కరోనా వైరస్‌ నిర్ధారణ అయినట్లు యూఎన్‌ వెల్లడించింది. ఇప్పటికే అమెరికాలో కరోనాతో 12మంది మరణించగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే, కరోనాను ఎదుర్కొనేందుకు 830కోట్ల డాలర్ల ప్రత్యేక నిధిని కేటాయిస్తూ అమెరికా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకు ఇరుపక్షాల మద్దతుతో సెనేట్‌ ఆమోదం తెలిపింది.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ