జపాన్ నౌకలో ‘కరోనా’.. 3,700 మందికి 14 రోజుల ‘నిర్బంధం’

జపాన్ లోని యోకొహోమా పోర్టుకు చేరింది ఓ నౌక.. ‘డైమండ్ ప్రిన్సెస్’ అనే ఈ నౌకలో కరోనా సోకిన 10 మంది వ్యక్తులు ఉన్నట్టు తెలియడంతో అంతా అలర్ట్ అయ్యారు. ఇందులోని 3,700 మందికి స్కానింగ్ టెస్టులు అవసరమయ్యాయి. వీరంతా 14 రోజుల పాటు తప్పనిసరిగా ఈ నౌకలో ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. వ్యాధి లక్షణాలున్న పది మందిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. తమను నౌకలోని తమ క్యాబిన్ల నుంచి బయటకి రాకూడదని ఆంక్షలు విధించారని […]

జపాన్ నౌకలో 'కరోనా'.. 3,700 మందికి 14 రోజుల 'నిర్బంధం'

జపాన్ లోని యోకొహోమా పోర్టుకు చేరింది ఓ నౌక.. ‘డైమండ్ ప్రిన్సెస్’ అనే ఈ నౌకలో కరోనా సోకిన 10 మంది వ్యక్తులు ఉన్నట్టు తెలియడంతో అంతా అలర్ట్ అయ్యారు. ఇందులోని 3,700 మందికి స్కానింగ్ టెస్టులు అవసరమయ్యాయి. వీరంతా 14 రోజుల పాటు తప్పనిసరిగా ఈ నౌకలో ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.

వ్యాధి లక్షణాలున్న పది మందిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. తమను నౌకలోని తమ క్యాబిన్ల నుంచి బయటకి రాకూడదని ఆంక్షలు విధించారని ఇతర ప్రయాణికులు వాపోతున్నారు. పైగా తమకు ఇచ్ఛే ఆహారాన్ని తగ్గించారని, లిక్కర్ కూడా ఆపివేశారని వారు తెలిపారు. సాధారణంగా టూరిస్టులతో రద్దీగా కనబడే ఈ ‘ ప్రిన్సెస్’ నౌక ఇప్పుడు వెలవెలబోతోంది. టెస్టుల్లో… తమకు కరొనా లేదని ఎప్పడు తేలుతుందా అని వందలమంది ఎదురుచూస్తున్నారు. హాంకాంగ్ లో 80 ఏళ్ళ వ్యక్తి ఒకరు గతనెల ఈ నౌక దిగివెళ్ళాడు.

అతనికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు తేలడంతో ఈ నౌకలోనివారిమీద కూడా అనుమానాలు తలెత్తాయి. ఈ షిప్ లో 3,711 మంది ప్రయాణికులను, సిబ్బందిని స్కాన్ చేశారని, వీరిలో 273 మందికి మరిన్ని టెస్టులు చేయాల్సి ఉందని జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి కసుకొబు కిటో తెలిపారు. 56 దేశాలకు చెందినవారు ఈ నౌకలో ప్రయాణిస్తున్నట్టు ఆయన చెప్పారు. టెస్టుల విషయంలో వీరంతా అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

Click on your DTH Provider to Add TV9 Telugu