తెలంగాణ జ‌ల‌సిరితో నిండుకుండలా ఉండాలి : సీఎం కేసీఆర్

ఇరిగేషన్ శాఖపై సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ నిర్వ‌హించారు. కమలాపూర్ జడ్పిటిసి భూమయ్య, రైతు శ్రీపాల్ రెడ్డిలను ఈ స‌మావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు ముఖ్య‌మంత్రి.

తెలంగాణ జ‌ల‌సిరితో నిండుకుండలా ఉండాలి : సీఎం కేసీఆర్
Follow us

|

Updated on: Jul 12, 2020 | 9:33 PM

ఇరిగేషన్ శాఖపై సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ నిర్వ‌హించారు. కమలాపూర్ జడ్పిటిసి భూమయ్య, రైతు శ్రీపాల్ రెడ్డిలను ఈ స‌మావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు ముఖ్య‌మంత్రి. ఈ సంద‌ర్భంగా అన్ని ప్రాజెక్టుల ప‌రిధిలో చివ‌రి ఆయ‌క‌ట్టు వ‌రకు నీరు అందించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల పుష్కలంగా నీటి లభ్యత ఏర్పడింద‌ని, అవసరమైతే నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాల‌ని సూచించారు. తెలంగాణలో చెరువులు, చెక్ డ్యామ్ లు ఎప్పుడూ నిండి ఉండాలని..ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ఎప్పుడూ 25 నుంచి 30 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఎస్సారెస్పీ వరద కాలువ, కాకతీయ కెనాల్ మధ్య 139 చెరువులు ఉన్నాయ‌ని… వాటిలో నీరంద‌ని వాటిని గుర్తించి..చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఇటు కృష్ణాలోను నీటి లభ్యత ఉండే అవకాశం ఉంద‌ని, జూరాల, భీమా ద్వారా నీటిని చెరువుల్లోకి త‌ర‌లించాల‌ని వివ‌రించారు. ప్రతి ప్రాజెక్టుకు ఆపరేషన్ రూల్స్ రూపొందించాల‌ని..ఎక్కువ జోన్లు ఏర్పాటు చేసి ప్రతి జోన్ కు ఒక సీఈని నియమించాలని ఆదేశించారు.