BREAKING NEWS : టీచర్లకు గుడ్ న్యూస్.. బదిలీలకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో రెండు మూడ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. టీచర్ల బదిలీలకు ఆమోదం తెలుపుతూ సంబంధిత...

BREAKING NEWS : టీచర్లకు గుడ్ న్యూస్.. బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Follow us

|

Updated on: Oct 12, 2020 | 9:27 PM

Teachers Transfers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో రెండు మూడ్రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. టీచర్ల బదిలీలకు ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైల్‌పై సీఎం జగన్ సంతకం చేశారు.

టీచర్ల బదిలీలపై మరో మూడు రోజుల్లో ఉత్తర్వులు కూడా రానున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రెండేళ్లు పూర్తి చేసుకున్న టీచర్లందరూ బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్ నిర్ణయంతో మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న టీచర్ల నిరీక్షణకు తెరపడనుంది. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగకుండా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదీలీల ప్రక్రియ చేపట్టాలని జగన్ సర్కార్  సంకల్పించింది.

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించిన వైఎస్ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మలిచేందుకు నాడు నేడు పథకానికి శ్రీకారం చుట్టి.. సమూల మార్పులు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలు మళ్లీ ప్రారంభయ్యే నాటికి వాటిలో మౌలిక వసతులను మెరుగుపర్చే దిశగా జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే జగనన్న విద్యాకానుకను ప్రవేశపెట్టి.. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలతో పాటు బ్యాగులు వంటి వాటిని అందించారు.

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్