చైనా కరెన్సీ నోట్లకు ‘కరోనా విరుగుడు’ పూతలు

| Edited By: Pardhasaradhi Peri

Feb 15, 2020 | 5:00 PM

చైనాలో కరోనా వైరస్ (కోవిడ్-19) సోకి మరణించినవారి సంఖ్య 15 వందలకు మించిపోగా.. కొత్తగా సుమారు 64 కేసులను గుర్తించారు. శుక్రవారం ఒక్కరోజే 143 మంది మరణించగా.. రెండువేలకు పైగా అదనపు కేసులు నమోదయ్యాయి. తాజాగా తమ కరెన్సీ నోట్లను కూడా చైనా ‘శుద్ది’ చేసే పనిని ప్రారంభించింది. వాడేసిన నోట్ల ద్వారా ఈ వ్యాధి వ్యాపించకుండా నోట్లను ‘బ్యాక్టీరియా’ రహితంగా చేసేందుకు నడుం కట్టింది. అందుకే కొత్త నోట్లపై కెమికల్ ను స్ప్రే చేస్తున్నారు. మొదట […]

చైనా కరెన్సీ నోట్లకు కరోనా విరుగుడు పూతలు
Follow us on

చైనాలో కరోనా వైరస్ (కోవిడ్-19) సోకి మరణించినవారి సంఖ్య 15 వందలకు మించిపోగా.. కొత్తగా సుమారు 64 కేసులను గుర్తించారు. శుక్రవారం ఒక్కరోజే 143 మంది మరణించగా.. రెండువేలకు పైగా అదనపు కేసులు నమోదయ్యాయి. తాజాగా తమ కరెన్సీ నోట్లను కూడా చైనా ‘శుద్ది’ చేసే పనిని ప్రారంభించింది. వాడేసిన నోట్ల ద్వారా ఈ వ్యాధి వ్యాపించకుండా నోట్లను ‘బ్యాక్టీరియా’ రహితంగా చేసేందుకు నడుం కట్టింది. అందుకే కొత్త నోట్లపై కెమికల్ ను స్ప్రే చేస్తున్నారు. మొదట బ్యాంకులు అల్ట్రా వయొలెట్ కిరణాలతో వీటిని ‘క్లీన్’ చేసి…  సీల్ చేయడమే గాక.. 14 రోజులపాటు స్టోర్ చేస్తారని, ఆ తరువాతే చెలామణిలోకి తెస్తారని తెలుస్తోంది. అవసరమైతే ప్రజలకు కొత్త నోట్లను పంపిణీ చేయాలని  ప్రభుత్వం బ్యాంకులను కోరింది. పైగా అక్కడి సెంట్రల్ బ్యాంకు..నాలుగు వందల కోట్ల కొత్త యువాన్ నోట్లను జారీ చేయాలని అత్యవసరంగా ఆదేశించింది. ఇన్ఫెక్షన్ సోకకుండా వీటిని కూడా ఐసొలేట్ చేయడం విశేషం.

అటు- ప్రభుత్వం ఇంకా పలు నివారణ చర్యలు తీసుకుంటోంది. ఆఫీసుల్లోని ఎలివేటర్లు, లిఫ్టుల్లో బటన్లను ప్రెస్ చేసేటప్పుడు.. టిష్యు పేపర్లను తప్పనిసరిగా వాడాలని ప్రజలను కోరుతున్నారు. వీటి పాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే డ్రైవర్లు సైతం రోజూ తమ కార్లను కెమికల్ తో శుభ్రం చేయాలని సూచిస్తున్నారు. ఇలా ఉండగా.. కరెన్సీ నోట్లపై కెమికల్ చల్లి వాటిని డిసిన్ఫెక్ట్ చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం ఉండదని, ఇందుకు కారణం అనేకమంది ప్రజలు మొబైళ్ల ద్వారానే చెల్లింపులు జరుపుతున్నారని కూడా అంటున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అంచనాల ప్రకారం.. ఇన్ఫెక్షన్ సోకిన రోగులతో ఎవరైనా డైరెక్ట్  కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు వారు వాడిన వస్తువుల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందట. అందువల్లే చైనా ఇంకా అప్రమత్తమవుతోంది.