యూఏఈ పయనమవుతున్న ఫ్రాంచైజీలు.. ఆగష్టు 21న సీఎస్‌కే

|

Aug 12, 2020 | 9:55 PM

సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో.. ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే బీసీసీఐ కోవిడ్ మార్గదర్శకాలు జారీ చేయగా..

యూఏఈ పయనమవుతున్న ఫ్రాంచైజీలు.. ఆగష్టు 21న సీఎస్‌కే
Follow us on

Chennai Super Kings To Travel UAE: సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో.. ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే బీసీసీఐ కోవిడ్ మార్గదర్శకాలు జారీ చేయగా.. షెడ్యూల్‌పై తలమునకలు అవుతోంది. అటు ఫ్రాంచైజీలు కూడా క్రికెటర్ల కోసం స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్, హోటల్స్‌ను బుక్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. అందరి కంటే ముందుగా ఆగష్టు 21న యూఏఈకి పయనం కానుంది. అయితే ఈలోపు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న ట్రైనింగ్ క్యాంప్‌కు సీఎస్‌కే జట్టు హాజరు కానున్నట్లు టీం సీఈఓ కాశీ విశ్వనాధన్ తెలిపారు. ధోని, రైనాతో సహా పలువురు టీం సభ్యులు ఈ నెల 16వ తేదీన చెన్నై వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. కాగా, ఐపీఎల్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలో జరగనుంది.