పులివెందుల పంచాయితీ అసెంబ్లీలో వద్దు : చంద్రబాబు

మీడియాపై ఆంక్షలు విధించిన  2430 జీవోపై ఏపీ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్షం చేస్తోన్న విమర్శలను సీఎం జగన్ ఖండించారు. అసలు చంద్రబాబు ఆ జీవోను చదివారో లేదో అర్ధం కావట్లేదన్నారు. జరగనిది, జరిగినట్టు చూపిస్తే..ప్రభుత్వం , అధికారులు చూస్తూ ఊరుకోవాలా అని జగన్ ప్రశ్నించారు. న్యాయం అనేది ఉంటుందని.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అభూతకల్పనలు చేసేవాళ్లపై పరువునష్టం వేసే రైట్ రాజ్యాంగం ఇచ్చిందని తెలిపారు. తనను భుజాన ఎత్తుకుని ముందుకు తీసుకెళ్లే వాళ్లపై […]

పులివెందుల పంచాయితీ అసెంబ్లీలో వద్దు : చంద్రబాబు
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 12, 2019 | 3:29 PM

మీడియాపై ఆంక్షలు విధించిన  2430 జీవోపై ఏపీ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్షం చేస్తోన్న విమర్శలను సీఎం జగన్ ఖండించారు. అసలు చంద్రబాబు ఆ జీవోను చదివారో లేదో అర్ధం కావట్లేదన్నారు. జరగనిది, జరిగినట్టు చూపిస్తే..ప్రభుత్వం , అధికారులు చూస్తూ ఊరుకోవాలా అని జగన్ ప్రశ్నించారు. న్యాయం అనేది ఉంటుందని.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అభూతకల్పనలు చేసేవాళ్లపై పరువునష్టం వేసే రైట్ రాజ్యాంగం ఇచ్చిందని తెలిపారు. తనను భుజాన ఎత్తుకుని ముందుకు తీసుకెళ్లే వాళ్లపై చంద్రబాబు సానుభూతి ప్రదర్శించడంలో ఆశ్యర్యం ఏముంటుందని పేర్కొన్నారు.

కాగా ఈ ఇష్యూపై చంద్రబాబు ప్రసంగించారు. తన ఇంగ్లీషు గురించి పదే, పదే విమర్శిస్తున్నారని..సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ఉద్దేశ్యపూర్యకంగా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. దేశంలో ఉన్న పత్రికా విలేఖర్లు అందరూ 2430 జీవోను వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే తరహాలో సీఎంగా ఉన్నప్పుడు 938 జీవోను తీసుకొచ్చారని, మీడియా వాళ్లు గొడవ చేయ్యడంతో ఆ జీవోను వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. వైఎస్ అలా చేస్తే జగన్ మాత్రం పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

మరోవైపు తాను 3 పేపర్లతో సభలోకి వస్తుండగా చీఫ్ మార్షల్ తనను తోసేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సభ్యులపై దాడి చేసిన  మార్షల్‌పై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సభకు రావడం కూడా అనవసరమని పేర్కొన్నారు. అంతేకాకుండా తప్పులు కేసులు పెట్టి  పులివెందుల పంచాయితీ అసెంబ్లీలో చెయ్యాలంటే..అది కుదరదన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి తాము ముందుంటామని చంద్రబాబు తెలిపారు.

ఈ ఆకులు రోజుకు 2 నమిలితే చాలు.. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు
ఈ ఆకులు రోజుకు 2 నమిలితే చాలు.. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు
అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..
అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..
పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా స్టార్ సింగర్ సంపాదన
పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా స్టార్ సింగర్ సంపాదన
ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య
ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య
పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం..
హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం..
ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..
ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..
జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ
అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ