Cyclone Amphan: అతి తీవ్ర తుఫానుగా ‘ఉంఫున్’.. అల్లకల్లోలంగా బంగాళాఖాతం..

ఓవైపు కోవిద్-19 మహమ్మారి విజృంభిస్తోంది. దీని కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. మరోవైపు.. భీకర తుఫాను 'ఉంఫున్' మరింత తీవ్ర రూపం దాల్చింది. గంటకు దాదాపు 230 కిలోమీటర్ల వేగంతో

Cyclone Amphan: అతి తీవ్ర తుఫానుగా 'ఉంఫున్'.. అల్లకల్లోలంగా బంగాళాఖాతం..
Follow us

| Edited By:

Updated on: May 19, 2020 | 11:33 AM

Cyclone Amphan: ఓవైపు కోవిద్-19 మహమ్మారి విజృంభిస్తోంది. దీని కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. మరోవైపు.. భీకర తుఫాను ‘ఉంఫున్’ మరింత తీవ్ర రూపం దాల్చింది. గంటకు దాదాపు 230 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఈ తుఫాను సోమవారం కేటగిరీ 5గా… సూపర్ సైక్లోనిక్ తుఫాను‌గా మారిందని వాతావరణ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.

కాగా.. సైక్లోన్ ఉంఫున్.. ఉత్తర-ఈశాన్యం వైపు పయనించి మరింత తీవ్రంగా పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాలను తాకనుంది. ఇప్పటివరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అతి పెద్ద తుఫాన్ ఇదే. ఈ తుఫాను వల్ల ఏపీ, ఒడిశా, బెంగాల్‌తోపాటూ… బంగ్లాదేశ్, మయన్మార్‌లో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని అమెరికా వాతావరణ అధికారులు అంచనా వేశారు. దీన్ని కేటగిరీ 5గా నిర్ణయించడాన్ని బట్టీ ఇది ఎంత ప్రమాదకరమైందో గుర్తించాలని అధికారులు తెలిపారు.

మరోవైపు.. బుధవారం మధ్యాహ్నం ఈ తుఫాను… బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటవచ్చనే అంచనా ఉంది.  అయితే.. ఇది తీరాన్ని దాటేటప్పుడు బలహీనపడుతూ… కేటగిరి 2 లేదా 3గా ఉంటుందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉంఫున్ తుఫాన్‌పై కేంద్రం అప్రమత్తమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. తుఫాన్‌ తీవ్రత, ముందస్తు సన్నద్దంపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే 25 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మొహరించినట్టుగా అధికారులు ప్రధానికి వివరించారు.

Latest Articles
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
కాస్టింగ్ కౌచ్ పై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
టాటా ఇన్నోవా ప్రియులకు గుడ్ న్యూస్..భారత్‌లో నూతన వేరియంట్ విడుదల
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర
పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర
మరో పేద రైతుకు ట్రాక్టర్‌ను అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
మరో పేద రైతుకు ట్రాక్టర్‌ను అందజేసిన రాఘవ లారెన్స్.. వీడియో
ఉదయాన్నే వీటిని చూడటం చాలా శుభప్రదం..రోజంతా హాయిగా సాగిపోతుంది
ఉదయాన్నే వీటిని చూడటం చాలా శుభప్రదం..రోజంతా హాయిగా సాగిపోతుంది
హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?
హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..