బంగారంతో పోటీ పడుతున్న యాలకులు..

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే యాలకులు ఇప్పుడు సామాన్యలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. యాలకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం వీటి ధరలు కిలో 8వేల రూపాయలు. కాగా, మార్కెట్లలో విడిగా తులం 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. కుంకుమపువ్వు, వెనీలా తరువాత వినూత్న పరిమళంతో కొద్దిపాటి తియ్యదనంతో చిన్నచిన్న పలుకులతో ఉండి ప్రపంచాన్ని ఏలుతున్న మసాల దినుసు యాలకులు. మిఠాయిలు, బిర్యాని, ఇతర మసాలా వంటకాలలో వేయడానికి సామాన్యుడు జంకుతున్నాడు. పెరిగిన ధరలతో యాలకులను అమ్మడానికి అమ్మకం […]

బంగారంతో పోటీ పడుతున్న యాలకులు..
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2019 | 12:51 PM

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే యాలకులు ఇప్పుడు సామాన్యలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. యాలకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ప్రస్తుతం వీటి ధరలు కిలో 8వేల రూపాయలు. కాగా, మార్కెట్లలో విడిగా తులం 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. కుంకుమపువ్వు, వెనీలా తరువాత వినూత్న పరిమళంతో కొద్దిపాటి తియ్యదనంతో చిన్నచిన్న పలుకులతో ఉండి ప్రపంచాన్ని ఏలుతున్న మసాల దినుసు యాలకులు. మిఠాయిలు, బిర్యాని, ఇతర మసాలా వంటకాలలో వేయడానికి సామాన్యుడు జంకుతున్నాడు. పెరిగిన ధరలతో యాలకులను అమ్మడానికి అమ్మకం దారులు ముందుకు రావడం లేదు. సాధారణంగా యలకులను వంటకాల్లోనే కాదు.. ఆలయాల్లో భక్తులకు పెట్టే లడ్డూ ప్రసాదంలోనూ కలుపుతారు. పెరిగిన ధరల కారణంగా ఆఖరికి దేవునికి పెట్టే నైవేథ్యంలోనూ ఇలాచి కంటికి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. అత్యధికంగా యాలకులను కేరళ రాష్ట్రంలో పండిస్తారు. ఈ సారి రావడంతో పంటలు కొట్టుకుపోయాయి. దీనివల్ల యాలకుల ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.