కాక రేపుతున్న దుబ్బాక ఉప ఎన్నిక.. వ్యూహాలతో పార్టీలు రెడీ

ప్రధాన రాజకీయ పార్టీలు సీరియస్‌గా భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఇపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన...

కాక రేపుతున్న దుబ్బాక ఉప ఎన్నిక.. వ్యూహాలతో పార్టీలు రెడీ
Follow us

|

Updated on: Oct 03, 2020 | 6:21 PM

By-poll heat in Telangana parties: ప్రధాన రాజకీయ పార్టీలు సీరియస్‌గా భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఇపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ సీటును కాపాడుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుండగా.. గులాబీ గూటి నుంచి దుబ్బాకను లాక్కునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

అధికారంలో వుండి ఉప ఎన్నికలో ఓటమి పాలైతే పరువు పోతుందన్న ఉద్దేశంతో దుబ్బాక ఎన్నికల బాధ్యతను ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగించారు గులాబీ దళపతి కేసీఆర్. దాంతో గత నెల రోజులుగా హరీశ్ రావు దుబ్బాకలో పరిస్థితిని చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. రామలింగారెడ్డి భార్య, తనయులకు టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడం ఖాయమే అయినా.. కొడుకుకు టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదని సుమారు 70 శాతం టీఆర్ఎస్ శ్రేణులు ఖరాఖండీగా తేల్చేశాయి. దాంతో అసమ్మతీయుల బుజ్జగింపు బాధ్యతలను భుజానికెత్తుకున్నారు హరీశ్ రావు. ట్రబుల్ షూటర్‌గా తనకున్న ఇమేజ్‌ని మరోసారి నిరూపించుకున్నారు. నెల రోజుల క్రితం వినిపించిన అసమ్మతి, అసంతృప్త గళాలు ప్రస్తుతం దాదాపు కనిపించడం లేదు. వినిపించడం లేదు. దాంతో హరీశ్ మంత్రాంగం ఫలించిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి తోడు దివంగత రామలింగారెడ్డి భార్యకే టిక్కెట్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం పార్టీ కీలక నేతలతో భేటీ అయిన గులాబీ దళపతి దుబ్బాకలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు దుబ్బాకలో రాజకీయం నెరిపేందుకు హడావిడి చేసినట్లు కనిపించిన కాంగ్రెస్ పార్టీలో ఇపుడు పెద్దగా కదలికలు కనిపించడం లేదు. దానికి కారణం ఉత్తరాదిన చెలరేగిన హథ్రాస్ నిరసనలలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెళ్ళడంతో దుబ్బాక విషయాన్ని చర్చించే నాథుడే ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. మరోవైపు గత ఎన్నికల్లో విపరీతంగా హడావిడి చేసి తక్కువ ఓట్లకే పరిమితమైన బీజేపీ.. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి రఘునందన్ రావునే బరిలోకి దింపనున్నది. శనివారం భేటీ అయిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం రఘునందన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతోపాటు దుబ్బాకలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా రచించింది.

Also read: కరోనా కష్టాల పరిష్కారానికి టీడీపీ వెబ్‌సైట్

Also read: బోరబండకు అక్టోబర్ భయం.. అప్పట్లో ఏం జరిగిందంటే?

Also read: శౌర్య క్షిపణి ప్రయోగం సక్సెస్.. స్పెషాలిటీ ఇదే

Latest Articles
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి