సెంటిమెంట్ రిపీట్..మరోసారి ఎర్రటి వస్త్రంలోనే బడ్జెట్​ ప్రతులు

తెలుగింటి కోడలు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్  రెండోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థికలోటు, నిరుద్యోగం వంటి సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తోన్న వేళ.. నిర్మలా సీతారామన్ 2020-21 గానూ ఎటువంటి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు బడ్జెట్ తమకు అనుకూలంగా ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పోయిన ఏడాది సాంప్రదాయంగా వస్తోన్న సూట్‌కేస్ పక్కనపెట్టి.. ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చారు నిర్మలా. ​ ఈసారి కూడా […]

సెంటిమెంట్ రిపీట్..మరోసారి ఎర్రటి వస్త్రంలోనే బడ్జెట్​ ప్రతులు

తెలుగింటి కోడలు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్  రెండోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థికలోటు, నిరుద్యోగం వంటి సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తోన్న వేళ.. నిర్మలా సీతారామన్ 2020-21 గానూ ఎటువంటి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు బడ్జెట్ తమకు అనుకూలంగా ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పోయిన ఏడాది సాంప్రదాయంగా వస్తోన్న సూట్‌కేస్ పక్కనపెట్టి.. ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను తీసుకొచ్చారు నిర్మలా. ​ ఈసారి కూడా ఆమె అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆర్థిక శాఖ కార్యాలయంలో నిపుణలు, ఆర్దిక రంగ మేధావులతో కలిసి ముందస్తు కసరత్తు చేపట్టిన నిర్మలా.. తమ టీంతో కలిసి ఎర్రటి వస్త్రంలో బడ్జెట్​ ప్రతులను పట్టుకుని వెళ్లి రాష్ట్రపతిని కలిశారు. అక్కడి నుంచి పార్లమెంట్​కు బయలుదేరారు. నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంట్​లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ .

Published On - 10:33 am, Sat, 1 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu