AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Body Odor: చెమట స్మెల్‌తో ఇబ్బంది పడుతున్నారా.. రోజూ నీటిలో వీటిని కలిపి స్నానం చేసి చూడండి..

శరీరం నుంచి వచ్చే చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటే ముందుగా తినే ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి. ఏ సీజన్ లోనైనా బిగుతుగా ఉండే దుస్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి దుస్తులు ధరిస్తే చెమట మరింత అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా చెడు వాసన తలెత్తుతుంది. అంతేకాదు నీరు ఎక్కువగా తాగాలి. ప్రస్తుతం చెమట నుంచి వచ్చే దుర్వాసనను నివారించడానికి ప్రతిరోజూ నీటిలో కొన్ని పదార్థాలు వేసి స్నానం చేయవచ్చు.

Body Odor: చెమట స్మెల్‌తో ఇబ్బంది పడుతున్నారా.. రోజూ నీటిలో వీటిని కలిపి స్నానం చేసి చూడండి..
Body Odor
Surya Kala
|

Updated on: Jun 17, 2024 | 6:43 PM

Share

వాతావరణంలో వచ్చిన మార్పులతో వేసవి కాలంలో మాత్రమే కాదు వర్షాకాలం లో కూడా ఎండవేడి, ఉక్కబోత సమస్య తప్పడం లేదు. ఈ సమస్యలతో ఆరోగ్య పరంగా ఇబ్బందులు మాత్రమే కాదు.. చెమట కూడా విపరీతంగా పడుతుంది. ఈ చెమట వల్ల శరీరం నుంచి వచ్చే దుర్వాసన ఇబ్బంది పెడుతుంది. ఇది వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. నిజానికి చెమట వాసనకు కారణం చెమటలో ఉండే బ్యాక్టీరియా. శరీరం నుంచి వచ్చే దుర్వాసన తగ్గించుకోవడానికి ప్రజలు అనేక రకాల ఖరీదైన డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్లను ఉపయోగిస్తారు. అయితే ఇవి శరీరానికి సువాసనను ఇచ్చినా చెమటలో పెరిగే బ్యాక్టీరియాను ఆపలేవు. అయితే ఈ సమస్యకు కొన్ని నేచరాల్ టిప్స్ తో చెక్ పెట్టవచ్చు. చెమట స్మెల్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

శరీరం నుంచి వచ్చే చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటే ముందుగా తినే ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి. ఏ సీజన్ లోనైనా బిగుతుగా ఉండే దుస్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి దుస్తులు ధరిస్తే చెమట మరింత అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా చెడు వాసన తలెత్తుతుంది. అంతేకాదు నీరు ఎక్కువగా తాగాలి. ప్రస్తుతం చెమట నుంచి వచ్చే దుర్వాసనను నివారించడానికి ప్రతిరోజూ నీటిలో కొన్ని పదార్థాలు వేసి స్నానం చేయవచ్చు.

కల్లు ఉప్పు

ఇవి కూడా చదవండి

రాతి ఉప్పు చాలా ఇళ్లలో సులభంగా దొరుకుతుంది. ఇది ఆహారానికి రుచిని పెంచడమే కాదు ఇందులో ఉండే గుణాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా పనిచేస్తాయి. చెమట నుంచి వచ్చే దుర్వాసన పోవాలంటే రాళ్ల ఉప్పును నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు. ఇది క్రియాశీల బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి, మొటిమలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

నిమ్మకాయ- బేకింగ్ సోడా

నిమ్మరసం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాదు శక్తిని కూడా ఇస్తుంది. అయితే ఇదే నిమ్మరసం మిమ్మల్ని చెమట వాసన నుంచి కూడా కాపాడుతుంది. దీని వాసన తాజాదనాన్ని కూడా ఇస్తుంది. దీనితో పాటు, బేకింగ్ సోడా కూడా చెమట వాసనను వదిలించుకోవడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ రెండు వస్తువులను నీటిలో వేసి స్నానం చేయాలి. చెమట వాసనను పోగొట్టడమే కాకుండా స్కిన్ ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు జాగ్రత్త వహించాలి.

వేప ఆకులు

వేపలోని ఔషధ గుణాలు సూక్ష్మక్రిములను చంపడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అందుకే వేప ఆకులను నీళ్లలో బాగా మరిగించి చల్లార్చి ఆ నీటితో స్నానం చేయాలి. చెమట వాసనను దూరం చేయడంతో పాటు కురుపులు, మొటిమల నుంచి కూడా రక్షణ ఇస్తుంది

యూకలిప్టస్ ఆయిల్

చెమట వాసనను తొలగించడానికి స్నానం చేసే నీటిలో యూకలిప్టస్ నూనెను కూడా జోడించవచ్చు. ఈ నూనె శరీరానికి ఆహ్లాదకరమైన సువాసనను అందించడమే కాదు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఉండే ఈ నూనే చర్మ ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అల్ల నేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
అల్ల నేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
లక్ష్మీదేవి పూజలో పారిజాత పుష్పాల ప్రాముఖ్యత.. ఇంట్లో సిరుల పంట!
లక్ష్మీదేవి పూజలో పారిజాత పుష్పాల ప్రాముఖ్యత.. ఇంట్లో సిరుల పంట!
ఆసుపత్రిలో కలకలం.. గర్భిణి చనిపోయిన గంటల్లోనే 3 తులాల బంగారం మాయం
ఆసుపత్రిలో కలకలం.. గర్భిణి చనిపోయిన గంటల్లోనే 3 తులాల బంగారం మాయం
చైన్‌తో కట్టేసిన కుక్కకే దమ్కీ ఇద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే..
చైన్‌తో కట్టేసిన కుక్కకే దమ్కీ ఇద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే..
పుల్ల పుల్లగా కారంగా.. పిల్లలకు ఎంతో నచ్చే బొరుగుల గొట్టం మిక్చర్
పుల్ల పుల్లగా కారంగా.. పిల్లలకు ఎంతో నచ్చే బొరుగుల గొట్టం మిక్చర్
కాలసర్ప దోషంతో ఆ రాశుల వారికి మహర్దశ! ఇక గోల్డెన్ టైమ్ మొదలైనట్టే
కాలసర్ప దోషంతో ఆ రాశుల వారికి మహర్దశ! ఇక గోల్డెన్ టైమ్ మొదలైనట్టే
ఏపీలోనూ గోవా తరహా బీచ్ షాక్స్.
ఏపీలోనూ గోవా తరహా బీచ్ షాక్స్.
ఉచిత MMTS ప్రయాణానికి బ్రేక్!
ఉచిత MMTS ప్రయాణానికి బ్రేక్!
అర్దరాత్రి ఫోన్ చేసి నా జాతకమే మార్చేశారు.. బ్రహ్మాజీ కామెంట్స్.
అర్దరాత్రి ఫోన్ చేసి నా జాతకమే మార్చేశారు.. బ్రహ్మాజీ కామెంట్స్.
స్నానం చేసే నీటిలో చిటికెడు కర్పూరం వేయండి..ఈ ప్రయోజనాలు తెలిస్తే
స్నానం చేసే నీటిలో చిటికెడు కర్పూరం వేయండి..ఈ ప్రయోజనాలు తెలిస్తే