IPL 2021 SEASON : ఐపీఎల్‌ సీజన్‌ ఫోర్టీన్‌కి రోడ్‌ మ్యాప్‌ రెడీ.. నైట్‌రైడర్స్ నుంచి ఒకరు ఔట్

ఐపీఎల్‌ సీజన్‌ ఫోర్టీన్‌కి రోడ్‌ మ్యాప్‌ రెడీ కాబోతోంది. పచ్చజెండా ఊపగానే ఐపీఎల్‌-2021 కోసం ఏర్పాట్లు మొదలుకాబోతున్నాయి. ఐపీఎల్‌ ప్లేయర్ల మినీ ఆక్షన్‌కి ముహూర్తం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 10న ఈ వేలం ఉండొచ్చని భావిస్తున్నారు.

IPL 2021 SEASON : ఐపీఎల్‌ సీజన్‌ ఫోర్టీన్‌కి రోడ్‌ మ్యాప్‌ రెడీ.. నైట్‌రైడర్స్ నుంచి ఒకరు ఔట్
Follow us

|

Updated on: Jan 06, 2021 | 10:17 PM

IPL 2021 SEASON : ఐపీఎల్‌ సీజన్‌ ఫోర్టీన్‌కి రోడ్‌ మ్యాప్‌ రెడీ కాబోతోంది. పచ్చజెండా ఊపగానే ఐపీఎల్‌-2021 కోసం ఏర్పాట్లు మొదలుకాబోతున్నాయి. ఐపీఎల్‌ ప్లేయర్ల మినీ ఆక్షన్‌కి ముహూర్తం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 10న ఈ వేలం ఉండొచ్చని భావిస్తున్నారు. ఏప్రిల్‌ 10 తర్వాత ఐపీఎల్‌ నిర్వహించాలనుకుంటోంది బీసీసీఐ. వాస్తవానికి ఈ ఏడాదే మెగా వేలం జరుగుతుందని భావించినా… ఇది అనుకూల సమయం కాదని బీసీసీఐ భావించింది.

అందుకే మెగా ఆక్షన్‌ బదులు మినీ వేలంతో సరిపెట్టాలని ఈమధ్యే బీసీసీఐ పాలకమండలి నిర్ణయించింది. గత సీజన్‌కు యూఏఈ వేదికైంది. ఈసారి ఐపీఎల్‌ భారత్‌లోనే నిర్వహించే అవకాశాలున్నాయంటున్నారు. ఐపీఎల్‌ ఫోర్టీన్‌ ఎడిషన్‌లో అనూహ్యమైన మార్పులు చేర్పులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఎనలిస్టులు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీంని ప్రక్షాళన చేసే అవకాశం ఉంది.

ఒంటిచేత్తో గెలిపిస్తాడనుకుంటే ఉసూరుమనిపించిన పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈసారి వదిలించుకునేలా ఉంది. సీజన్‌ ఫోర్టీన్‌లో ఆడటం లేదంటూ.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పాడు సౌతాఫ్రికా స్టార్‌ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌. మొన్నటి ఐపీఎల్‌ సీజన్‌లో కోట్లు పెట్టి పాడుకున్న ఆటగాళ్లు అట్టర్‌ఫ్లాప్‌ అయ్యారు.

ఏమాత్రం అంచనాలు లేని ప్లేయర్లు తడాఖా చూపించారు. దీంతో ఫ్రాంచైజీల లెక్కలు, అంచనాలు ఈసారి మారిపోయేలా ఉన్నాయి. ఇప్పటిదాకా 8 జట్లతో అలరిస్తున్న ఐపీఎల్‌ 2022కు పది జట్లకు పెరగబోతోంది. అహ్మదాబాద్‌ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త ఫ్రాంచైజీని దక్కించుకోవడానికి కార్పొరేట్‌ దిగ్గజాలు పోటీపడుతున్నాయి.