పోస్టుమార్టం తరువాత అసలు నిజాలు తెలుస్తాయి: బాలకృష్ణ

కోడెల శివప్రసాదరావు మరణం పార్టీకి రాష్ట్రానికి తీరని లోటని బాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు పార్టీకి ఎంతో సేవచేసిన వ్యక్తి ఆకస్మిక మరణం నన్ను షాక్ కి గురి చేసిందని అన్నారు. కోడెల హాస్పిటల్ కి వచ్చేలోపే అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయనను బతికించేందుకు వైద్యులు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని వివరించారు. కాన్సర్ నిరోదానికి  కోడెల ఎంతో సేవ చేసారని కొనియాడారు. అయన మరణం వెనుక ఉన్న అసలు నిజాలు పోస్ట్ మార్టం తరువాత తెలుస్తాయని […]

పోస్టుమార్టం తరువాత అసలు నిజాలు తెలుస్తాయి: బాలకృష్ణ
Follow us

| Edited By:

Updated on: Sep 16, 2019 | 5:24 PM

కోడెల శివప్రసాదరావు మరణం పార్టీకి రాష్ట్రానికి తీరని లోటని బాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు పార్టీకి ఎంతో సేవచేసిన వ్యక్తి ఆకస్మిక మరణం నన్ను షాక్ కి గురి చేసిందని అన్నారు. కోడెల హాస్పిటల్ కి వచ్చేలోపే అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయనను బతికించేందుకు వైద్యులు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదని వివరించారు. కాన్సర్ నిరోదానికి  కోడెల ఎంతో సేవ చేసారని కొనియాడారు. అయన మరణం వెనుక ఉన్న అసలు నిజాలు పోస్ట్ మార్టం తరువాత తెలుస్తాయని బాలకృష్ణ స్పష్టం చేశారు.

బసవతారకం ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బవసతారకం ఆస్పత్రి నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని బాలకృష్ణ అన్నారు. ఆస్పత్రి నిర్మాణానికి నిధులు సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. 2000 నుంచి 2009 మధ్యకాలంలో ఈ ఆస్పత్రికి ఛైర్మన్‌గా వ్యవహరించారని గుర్తుచేసుకున్నారు. పలు మంత్రి పదవులు అలంకరించి ప్రజలకు ఎనలేని సేవలందించారన్నారు. నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా తన ముద్ర వేశారని చెప్పారు. ఆయన మృతిని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని బాలకృష్ణ అన్నారు. ఆయన మరణవార్త విన్న వెంటనే సినిమా షూటింగ్‌ రద్దు చేసుకుని వచ్చానని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అన్నారు.

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..