రెండోరోజు ‘అటుకుల బతుకమ్మ’… వాయనంగా బెల్లం, అటుకులు!

బతుకమ్మ… తెలంగాణ ప్రజల బతుకు పండుగ. పూలకు పూజలు చేసే పండుగ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. సెప్టెంబరు 28న ఎంగిలిపూల బతుకమ్మతో తెలంగాణలో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇక బతుకమ్మ పండుగలో భాగంగా రెండో రోజైన శనివారం (సెప్టెంబరు 29)  ఆశ్వీయుజ మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు ‘ అటుకుల బతుకమ్మ’గా అమ్మవారిని పూజిస్తారు. […]

రెండోరోజు 'అటుకుల బతుకమ్మ'... వాయనంగా బెల్లం, అటుకులు!
Follow us

| Edited By:

Updated on: Sep 29, 2019 | 4:21 PM

బతుకమ్మ… తెలంగాణ ప్రజల బతుకు పండుగ. పూలకు పూజలు చేసే పండుగ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. సెప్టెంబరు 28న ఎంగిలిపూల బతుకమ్మతో తెలంగాణలో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇక బతుకమ్మ పండుగలో భాగంగా రెండో రోజైన శనివారం (సెప్టెంబరు 29)  ఆశ్వీయుజ మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు ‘ అటుకుల బతుకమ్మ’గా అమ్మవారిని పూజిస్తారు. దేవీ శరన్నవరాత్రులు కూాడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి.

బతుకమ్మను పేర్చడానికి అవసరమైన పూలకోసం ఉదయాన్నే అడవికి వెళ్లి తంగేడు , గునుగు, బంతి, చామంతి, అడవి గడ్డి పూలు తీసుకువస్తారు. ఈ పూలను రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చి, ఆడవారు అందరూ కలసి ఆడుకొని సాయంత్రం చెరువులలో నిమజ్జనం చేస్తారు. నైవేద్యంగా సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు సమర్పిస్తారు. ఈ రోజు అటుకులను వాయనంగా ఇస్తారు.

బతుకమ్మ పండుగ జరిగే 9 రోజులు 9 రూపాల్లో బతుకమ్మను తయారుచేసి, పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో ‘బతుకమ్మ’ పండుగను తెలంగాణ వ్యాప్తంగా పిల్లాపెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. వీటిలో చివరిదైన సద్దుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?