సీఎం కేసిఆర్‌కు ఓవైసీ అభినందనలు.. ప్రత్యేక ట్వీట్..

కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసిఆర్‌కు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రత్యేక ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఓ గొప్ప ముందడుగన్న ఓవైసీ.. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు సాగునీరు, గృహాలకు మంచినీరు అందుతాయని పేర్కొన్నారు. కాగా, ఇవాళ ఉదయం కొండపోచమ్మ జలాశయాన్ని చినజీయర్ స్వామితో కలిసి సీఎం కేసిఆర్ దంపతులు ప్రారంభించారు. 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లను ఏర్పాటు చేయగా, ఇందులో రెండు […]

  • Updated On - 3:50 pm, Fri, 29 May 20 Edited By: Pardhasaradhi Peri
సీఎం కేసిఆర్‌కు ఓవైసీ అభినందనలు.. ప్రత్యేక ట్వీట్..

కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసిఆర్‌కు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రత్యేక ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఓ గొప్ప ముందడుగన్న ఓవైసీ.. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు సాగునీరు, గృహాలకు మంచినీరు అందుతాయని పేర్కొన్నారు.

కాగా, ఇవాళ ఉదయం కొండపోచమ్మ జలాశయాన్ని చినజీయర్ స్వామితో కలిసి సీఎం కేసిఆర్ దంపతులు ప్రారంభించారు. 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లను ఏర్పాటు చేయగా, ఇందులో రెండు మోటార్లను స్విచ్చాన్‌ చేసి.. కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి కాళేశ్వరం జలాల ఎత్తిపోతను ప్రారంభించారు. గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్ డెలివరీ సిస్టర్న్ వద్దకు చేరుకోనున్నాయి. అనంతరం పరుగు పరుగున కొండపోచమ్మకు చేరుకుంటున్న గోదారమ్మకు సీఎం కేసీఆర్, చిన్నజీయర్ స్వామి జల హారతి ఇచ్చారు.

Read More: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి పరీక్షలు చేశాకే అనుమతి..