విమాన సర్వీసుల్లో రోజుకు 23 అడ్డంకులు: డీజీసీఏ చీఫ్‌

దేశంలో విమానాల రాకపోకలకు ఆటంకం కలిగించే ఘటనలు రోజుకు 23 వరకు చోటుచేసుకుంటున్నాయని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ చీఫ్‌ అరుణ్‌కుమార్‌ వెల్లడించారు. పక్షులు ఢీకొట్టడం, ధూళి, తుపాన్లు, వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడంతో పాటు విమానాల్లో తలెత్తే సాంకేతిక కారణాల వల్ల రోజుకు 20 నుంచి 23 వరకు విమానాల రాకపోకలకు ఆటంకం కల్గించే ఘటనలు చోటుచేసుకుంటున్నట్టు  ఆయన వివరించారు. భారత్‌లో రోజూ మొత్తం 8వేల విమాన సర్వీసులు నడుస్తుండగా.. వాటిలో 3500 సర్వీసులు […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:41 am, Fri, 30 August 19
విమాన సర్వీసుల్లో రోజుకు 23 అడ్డంకులు: డీజీసీఏ చీఫ్‌

దేశంలో విమానాల రాకపోకలకు ఆటంకం కలిగించే ఘటనలు రోజుకు 23 వరకు చోటుచేసుకుంటున్నాయని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ చీఫ్‌ అరుణ్‌కుమార్‌ వెల్లడించారు. పక్షులు ఢీకొట్టడం, ధూళి, తుపాన్లు, వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడంతో పాటు విమానాల్లో తలెత్తే సాంకేతిక కారణాల వల్ల రోజుకు 20 నుంచి 23 వరకు విమానాల రాకపోకలకు ఆటంకం కల్గించే ఘటనలు చోటుచేసుకుంటున్నట్టు  ఆయన వివరించారు. భారత్‌లో రోజూ మొత్తం 8వేల విమాన సర్వీసులు నడుస్తుండగా.. వాటిలో 3500 సర్వీసులు దేశీయంగానే సేవలందిస్తున్నాయి. పౌరవిమానయాన నియంత్రణ విభాగం అధికారులు ఇదివరకు కేబిన్‌ సిబ్బంది, పైలట్లకు మాత్రమే బ్రీత్‌ అనలైజర్లు పరీక్ష చేసేవారని.. తాజాగా  ఏటీసీ అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి సైతం ఈ పరీక్ష నిర్వహించాలని యోచిస్తోందని ఆయన పేర్కొన్నారు.