అసలు యాపిల్ ఐఫోన్.. పనికొచ్చేనా..?

ఐఫోన్ యూజర్లకు శుభవార్త. యాపిల్ సంస్థ నుంచి సరికొత్త ఐఫోన్ త్వరలోనే లాంచ్ కానుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం యాపిల్ సంస్థ నుంచి కొత్త ఐఫోన్ ఎస్‌ఈ2 తొందరలోనే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రానుంది. ఈ సరికొత్త స్మార్ట్ ఐఫోన్‌ను వచ్చే సంవత్సరం మొదట్లో సంస్థ ఆవిష్కరించనుందట. అంతేకాకుండా యాపిల్ సంస్థ నుంచి వచ్చిన ఐఫోన్‌ 11 మోడల్స్ కంటే దీని ధర మరింత చీప్‌గా ఉంటుందని సమాచారం. ఈ కొత్త ఐఫోన్ ఎస్‌ఈ2 మోడల్ చూడడానికి అటుఇటుగా […]

అసలు యాపిల్ ఐఫోన్.. పనికొచ్చేనా..?
Follow us

|

Updated on: Oct 05, 2019 | 6:48 PM

ఐఫోన్ యూజర్లకు శుభవార్త. యాపిల్ సంస్థ నుంచి సరికొత్త ఐఫోన్ త్వరలోనే లాంచ్ కానుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం యాపిల్ సంస్థ నుంచి కొత్త ఐఫోన్ ఎస్‌ఈ2 తొందరలోనే మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రానుంది. ఈ సరికొత్త స్మార్ట్ ఐఫోన్‌ను వచ్చే సంవత్సరం మొదట్లో సంస్థ ఆవిష్కరించనుందట. అంతేకాకుండా యాపిల్ సంస్థ నుంచి వచ్చిన ఐఫోన్‌ 11 మోడల్స్ కంటే దీని ధర మరింత చీప్‌గా ఉంటుందని సమాచారం.

ఈ కొత్త ఐఫోన్ ఎస్‌ఈ2 మోడల్ చూడడానికి అటుఇటుగా ఐఫోన్ 8 మాదిరిగానే ఉంటుందని ఆ సంస్థ సీఈఓ పేర్కొన్నారు. అంతేకాక ఈ ఫోన్‌ అధునాతనమైన ఏ13 బయోనిక్ చిప్ కలిగి ఉంటుందని.. 3జిబి ర్యామ్, 4.7 డిస్‌ప్లే, ఫేస్ ఐడీ, టచ్ ఐడీతో చాలా సెక్యూర్‌గా ఉంటుందట. ఇకపోతే మొదటి నుంచి యాపిల్ సంస్థ జనాలను ఆకట్టుకోవడానికి తక్కువ ధరకే ఐఫోన్లను ఆవిష్కరిస్తూ వచ్చింది. కాగా, త్వరలో విడుదల కానున్న ఐఫోన్ ఎస్‌ఈ2 మోడల్ కూడా ఖచ్చితంగా $500 డాలర్ల కంటే తక్కువకే మార్కెట్‌లో లభిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎప్పటికప్పుడు ఐఫోన్ తన మార్క్ తగ్గకుండా.. మార్కెట్‌లో క్రేజ్‌ను పెంచుకుంటోంది. కాని, ఒక్కసారి అది రిపేర్ అయితే మాత్రం సర్వీస్ సెంటర్లు విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కాబట్టి త్వరలో రాబోతున్న ఐఫోన్ ఈ సమస్యలన్నింటిని అధిగమించి.. యూజర్లను ఆకట్టుకోనుందా.. లేదా చూడాలి.