ఏపీకి మరో అల్పపీడన ముప్పు.. రెండు రోజులు భారీ వర్షాలు.!

ఏపీకి మరో అల్పపీడన ముప్పు పొంచి ఉంది. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న రెండు రోజుల్లో ఇది తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయి.

ఏపీకి మరో అల్పపీడన ముప్పు.. రెండు రోజులు భారీ వర్షాలు.!

Updated on: Aug 24, 2020 | 5:45 PM

AP Rain Alert: ఏపీకి మరో అల్పపీడన ముప్పు పొంచి ఉంది. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న రెండు రోజుల్లో ఇది తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు దీనికి అనుబంధంగా 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించింది. వీటి ప్రభావంతో నేడు, రేపు ఉత్తర కోస్తాంధ్రా, యానాంలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..

అంతేకాక ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక దక్షిణ కోస్తాంధ్రా, కోస్తాంధ్రా,రాయలసీమలలో ఈ రోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కాగా, తెలంగాణలో కూడా ఈ అల్పపీడన ప్రభావం కారణంగా రాగాల మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని.. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..

Loading...
Unable to load recommendations.
Follow Us