లారీ ఓనర్స్ కు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలన నిర్ణయం తీసుకుంది. కష్టాల్లో వాహనదారులకు వెసులుబాటు కల్పిస్తూ జీవోను జారీ చేసింది. రవాణా వాహనాల పన్ను చెల్లింపు గడువును సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

లారీ ఓనర్స్ కు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం
Uttar Pradesh: Truck drivers wearing ‘lungi’ and vest will now be fined Rs 2000

Updated on: Aug 01, 2020 | 4:38 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలన నిర్ణయం తీసుకుంది. కష్టాల్లో వాహనదారులకు వెసులుబాటు కల్పిస్తూ జీవోను జారీ చేసింది. రవాణా వాహనాల పన్ను చెల్లింపు గడువును సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం మచిలీపట్నంలో మంత్రి నానితో లారీ, ట్రాలీ యాజమానుల సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా లాక్ డౌన్ ప్రభావం రవాణా రంగపై తీవ్రంగా పడిందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. లారీ ఓనర్లు పడుతున్న ఇబ్బందులు, సాధక బాధకాలను మంత్రికి వివరించారు. రవాణా పన్ను చెల్లింపు గడువు పెంపుదలకు సంబంధించిన ఫైలు ఇంకా పెండింగ్‌లో ఉందని, సమస్యను సత్వరం పరిష్కరించి వెసులుబాటు కల్పించాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన మంత్రి నాని అధికారులతో మాట్లాడి గడువును పెంచుతూ జీవోను జారీ చేయించారు. దీంతో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల లారీ యాజమానుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.