బీజేపీ ఎదుగుదలను దీదీ జీర్ణించుకోలేక పోతున్నారు..బెంగాల్ పర్యటనలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

|

Dec 20, 2020 | 8:18 PM

బెంగాల్‌లో సుడిగాలి ప్రచారం చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా టీవీ9కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. బెంగాల్‌లో ఆరేళ్ల నుంచి చేస్తున్న కృషికి ఫలితం ఇప్పడు కనిపిస్తున్నాయి.

బీజేపీ ఎదుగుదలను దీదీ  జీర్ణించుకోలేక పోతున్నారు..బెంగాల్ పర్యటనలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..
Follow us on

Amit Shah With Tv9 : బెంగాల్‌లో సుడిగాలి ప్రచారం చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా టీవీ9కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. బెంగాల్‌లో ఆరేళ్ల నుంచి చేస్తున్న కృషికి ఫలితం ఇప్పడు కనిపిస్తున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమత పాలనపై ప్రజలు విసిగిపోయారని అమిత్ షా అన్నారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీకే బెంగాల్ ప్రజలు పట్టం కట్టడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇప్పటికే బెంగాల్‌లో లక్షలాదిమంది బీజేపీలో చేరరని అన్నారు. గ్రామగ్రామాన పార్టీ విస్తరించిందన్నారు. అందుకే అధికార పార్టీ నేతలు మా పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు.

అధికార పార్టీ చేస్తున్న దాడులకు భయపడాల్సిన అవసరం లేదని మా కార్యకర్తలకు నేను ధైర్యం ఇస్తున్నాను అంటూ  ఆందోళన అవసరం లేదన్నారు. సువేందు అధికారి చేరికతో బీజేపీకి చాలా లాభం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోందని అన్నారు.

బెంగాల్‌లో గెలుపు కోసం అగ్రనేతలను రంగంలోకి దింపారు అంటూ మమతా బెనర్జీ చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఇక్కడి సంస్కృతిని గౌవరవించడం తెలుసన్నారు. ఖుదీరాం బోస్‌ .. వివేకానంద, ఠాగూర్‌ను ప్రతి బీజేపీ కార్యకర్త గౌరవిస్తారు.. గురుదేవ్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ను ఆరాధించడం.. మాకు కొత్తేమి కాదని అన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి సంకుచిత భావాన్ని వీడాలి అంటూ హితవు పలికారు. ఎన్నికలతో ఈ అంశాలకు సంబంధం లేదని అన్నారు.