కరోనా ఎఫెక్ట్.. హాలీవుడ్ స్టార్ కి ఆస్ట్రేలియన్ డిష్..

తన భార్య రీటా విల్సన్ తో బాటు కరోనా వైరస్ బారిన పడిన హాలీవుడ్ స్టార్ టామ్ హాంక్స్ ఆస్ట్రేలియాలో ఐసొలేషన్ లో ఉన్నారు. ఆయనకు పూర్తి శాకాహారమైన ఆస్ట్రేలియన్ డిష్ 'వెజిమైట్' ని డాక్టర్లు ఇస్తున్నారు

కరోనా ఎఫెక్ట్.. హాలీవుడ్ స్టార్ కి ఆస్ట్రేలియన్ డిష్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 16, 2020 | 5:00 PM

తన భార్య రీటా విల్సన్ తో బాటు కరోనా వైరస్ బారిన పడిన హాలీవుడ్ స్టార్ టామ్ హాంక్స్ ఆస్ట్రేలియాలో ఐసొలేషన్ లో ఉన్నారు. ఆయనకు పూర్తి శాకాహారమైన ఆస్ట్రేలియన్ డిష్ ‘వెజిమైట్’ ని డాక్టర్లు ఇస్తున్నారు. బ్రెడ్ స్లైస్ లో ఈ టోస్టుతో కూడిన తన డిష్  ఫోటోను  హాంక్స్.. తన ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ దేశంలో ఇది చాలా పాపులర్ వెజిమైట్ అని ఆయన పేర్కొన్నారు. ఇది తినడానికి తానేమీ సంకోచించడం లేదని, టేస్టీగా ఉందని ఆయన తెలిపారు. నాకు ఈ వైరస్ సోకిందని తెలియగానే నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందివారికందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, మనకు మనం మన హెల్త్ గురించి శ్రధ్ధ తీసుకుందామని ఆయన అన్నారు. ఆరోగ్యం విషయంలో ఒకరికొకరం తోడుగా ఉందామని కూడా టామ్ హాంక్స్ అన్నారు.