బాయ్‌కాట్ చైనీస్ యాప్స్: భారత్ బాటలో.. అమెరికా, ఆస్ట్రేలియా..

గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. చైనాకు చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం విదితమే. ఈ క్రమంలో టిక్‌టాక్ యాప్‌ను నిషేధించడాన్ని అమెరికా ప్రభుత్వం కూడా సమర్థించింది.

బాయ్‌కాట్ చైనీస్ యాప్స్: భారత్ బాటలో.. అమెరికా, ఆస్ట్రేలియా..
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2020 | 9:12 PM

గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో.. చైనాకు చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం విదితమే. ఈ క్రమంలో టిక్‌టాక్ యాప్‌ను నిషేధించడాన్ని అమెరికా ప్రభుత్వం కూడా సమర్థించింది. అమెరికా కూడా టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధించాలంటూ అనేక మంది కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. అమెరికన్ యూజర్ల డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తోందంటూ అనేక మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు.. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా టిక్‌టాక్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యాప్ ద్వారా చైనా ప్రభుత్వం యూజర్ల డేటాను దొంగిలిస్తోందని ఆస్ట్రేలియాలోని శాసనకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం మాదిరిగానే ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా టిక్‌టాక్‌ యాప్‌ను నిషేధించాలని కోరుతున్నారు. అయితే.. తమ యూజర్ల డేటాను చైనాలో స్టోర్ చేయడం లేదని, చైనా ప్రభుత్వం యూజర్ల డేటాను యాక్సెస్ చేయడానికి అవకాశం లేదంటూ టిక్‌టాక్ పేరెంట్ కంపెని బైట్‌డ్యాన్స్ ఇప్పటికే అనేక సార్లు చెబుతూ వచ్చింది.

ఈ చైనీస్ యాప్ యూజర్ల డేటాను తాము అమెరికా, సింగపూర్లలో స్టోర్ చేస్తున్నట్టు బైట్‌డ్యాన్స్ చెబుతోంది. అయితే డేటా ఏ దేశంలో ఉన్నా చైనా ప్రభుత్వానికి ఆ డేటాను యాక్సెస్ చేయడం కష్టమైన పని కాదంటూ అనేక మంది వాదిస్తున్నారు. మరోపక్క ప్రపంచంలో ఏ ఒక్క స్టోరేజ్ సిస్టమ్ కూడా వంద శాతం సురక్షితం కాదని జనవరిలో బైట్‌డ్యాన్స్ సంస్థ చెప్పుకొచ్చింది. ఏదేమైనప్పటికి టిక్‌టాక్ కంపెనీ చైనాకు చెందడంతో.. ఈ అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.