Krithi Shetty: కృతీ శెట్టికి అబ్బాయిల్లో నచ్చ‌ని అంశం ఏంటో తెలుసా? ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన బేబ‌మ్మ‌..

Krithi Shetty: ఒక్క సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారారు న‌టి కృతీ శెట్టి. ఉప్పెన చిత్రంలో త‌న‌దైన క్యూట్ న‌ట‌న‌, అందంతో ఆక‌ట్టుకున్న కృతీ ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించారు. ఈ సినిమా విజ‌యంతో...

Krithi Shetty: కృతీ శెట్టికి అబ్బాయిల్లో నచ్చ‌ని అంశం ఏంటో తెలుసా? ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన బేబ‌మ్మ‌..
Kritishetty Interview

Updated on: May 23, 2021 | 10:24 AM

Krithi Shetty: ఒక్క సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారారు న‌టి కృతీ శెట్టి. ఉప్పెన చిత్రంలో త‌న‌దైన క్యూట్ న‌ట‌న‌, అందంతో ఆక‌ట్టుకున్న కృతీ ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించారు. ఈ సినిమా విజ‌యంతో కృతీకి వ‌రుస సినిమా అవ‌కాశాలు క్యూ కట్టాయి. బ‌డా హీరోల స‌ర‌స‌న న‌టించే ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిందీ బ్యూటీ. ఇక సోష‌ల్ మీడియాలో కృతీకి విప‌రిత‌మైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ భామ ఒక్క ఫొటో పోస్ట్ చేస్తే చాలు ల‌క్ష‌ల సంఖ్య‌లో లైక్‌ల వ‌ర్షం కురుస్తుంది.
ఈ క్ర‌మంలోనే కృతీ వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను తెలుసుకోవ‌డానికి నెటిజ‌న్లు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కృతీ చెప్పిన కొన్ని విష‌యాలు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. అబ్బాయిల్లో మీకు న‌చ్చ‌ని అంశం ఏంట‌న్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. అబద్దం చెప్పేవారంటే అస్స‌లు ఇష్ట‌ముండ‌దు. ఇది కేవ‌లం అబ్బాయిల‌కే ప‌రిమితం కాకుండా అబ‌ద్ధ‌మాడే అమ్మాయిలు సైతం న‌చ్చ‌రు. నిజాయితీ, బోల్డ్‌గా మొహం మాటం లేకుండా మాట్లాడే వారు న‌చ్చుతారు. త‌ప్పు చేసినా స‌రే.. భయపడకుండా నిజాయితీగా ఒప్పుకునే వ్యక్తిత్వం ఉన్న వారంటే నాకు ఇష్టం అంటూ త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టిందీ ముద్దుగుమ్మ‌. ఇక కృతీ సినిమాల విష‌యానికొస్తే.. నాని హీరోగా ‘శ్యామ్ సింగ‌రాయ్‌తో పాటు, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్‌ పోతినేనితో ఓ సినిమాలో న‌టిస్తున్నారు.

Also Read:  Allu Arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు… 400 మిలియన్ లైక్స్ సాధించిన బుట్ట బొమ్మ సాంగ్..

Andrea Meza: మిస్ యూనివర్స్‌ ఆండ్రియాకి ముందే పెళ్లైందా..? అసలు విషయం ఎంటంటే..?

Keerthy Suresh : త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్న కీర్తిసురేష్ అంటూ వార్తలు.. అసలు విషయం చెప్పిన మహానటి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us