Video Viral: అందుకే కోతి చేష్టలు అనేది.. చెట్టు కింద సేదతీరుతున్న పులులతో పరాచకాలు.. కట్ చేస్తే

భూమిపై జీవించే ప్రతి జీవి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. అడవిలో అయితే ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. తమ అస్తిత్వం కోసం, మనుగడ కోసం కొన్ని సార్లు తీవ్రంగా పోరాడాల్సి వస్తుంది. అక్కడ పై చేయి సాధించిన వారే రాజ్యమేలుతారు....

Video Viral: అందుకే కోతి చేష్టలు అనేది.. చెట్టు కింద సేదతీరుతున్న పులులతో పరాచకాలు.. కట్ చేస్తే
Monkey Tiger Video Viral

Updated on: Sep 02, 2022 | 1:50 PM

భూమిపై జీవించే ప్రతి జీవి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. అడవిలో అయితే ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. తమ అస్తిత్వం కోసం, మనుగడ కోసం కొన్ని సార్లు తీవ్రంగా పోరాడాల్సి వస్తుంది. అక్కడ పై చేయి సాధించిన వారే రాజ్యమేలుతారు. ఇలాంటి జంతువులు అడవిలో చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా సింహం, పులి, చిరుత గురించి చెప్పుకోవాలి. తెగువ, రాజసం, ధైర్యం కారణంగా సింహం అడవికి రాజు అయింది. పులి కూడా సింహానికి ఏ మాత్రం తీసిపోదు. తన జోలికి వచ్చిన ఏ జంతువునైనా అది ఒక్క పంజాతో తన పవర్ ఏంటో చూపిస్తుంది. అయినప్పటికీ కొన్ని సార్లు విచిత్రాలు జరుగుతుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ అవుతుంటాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్లిప్ లో ఓ కోతి చెట్టు కొమ్మను పట్టుకుని ఊగుతూ ఉంటుంది. ఆ చెట్టు కింద కొన్ని పులులు సేద తీరుతూ ఉంటాయి. అయితే ఆ కోతి చేసిన చిలిపి పని నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. చెట్టుపై వేలాడుతున్న కోతి కింద ఉన్న పులిని కొట్టడం, తోక పట్టుకుని లాగడం వంటి చేష్టలకు పాల్పడుతుంది. కోతిని పట్టుకుందామని పులులు ప్రయత్నిస్తే అది వెంటనే చెట్టు ఎక్కేస్తుంది. ఇక చేసేదేమీ లేక పులులు దూరంగా ఉన్న పొదల్లోకి వెళ్లిపోతాయి. అయినా కోతి తన చిలిపి పనులను మానకోలేదు. అక్కడికి కూడా వచ్చి పులి చెవి, తోక పట్టుకుని లాగుతుంది. ఇలా చాలా సమయం వరకు పులిని ఇబ్బంది పెడుతూనే ఉంది.

ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. ఈ క్లిప్ కు ఇప్పటి వరకు మూడు లక్షలకు పైగా వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కోతికి ఇవన్ని అవసరమా అని, అందుకే కోతి చేష్టలు అన్నారని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను స్నేహితులు, బంధువులు, తెలిసిన వారికి షేర్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి