వృద్ధుడి తలపై మొలిచిన కొమ్ము!

మన జానపద కథల్లో ఒంటి కన్ను లేదా ఒంటి కొమ్ము రాక్షసుల గురించి విన్నాం. నిజ జీవితంలో అటువంటి వారు ఎప్పుడూ మనకు తటస్థ పడలేదు కదూ..ఈ వార్త చూసిన వారెవరికైనా మనుషులకు కొమ్ములెట్లా మొలుస్తాయి అనే అనుమానం రావచ్చు. శ్యాం లాల్ యాదవ్ అనే ఈ వృద్ధుడి ఉదంతం తెలుసుకుంటే అది ఎలా సాధ్యమో అర్థమౌవుతుంది. మధ్యప్రదేశ్‌లో 74 ఏళ్ల శ్యామ్‌లాల్ అనే ఓ వృద్దుడు అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. కొన్నేళ్ల క్రితం శ్యామ్‌లాల్ తలపై […]

వృద్ధుడి తలపై మొలిచిన కొమ్ము!
MP Man Grows Devil's Horn After Head Injury; Doctors Call it a Rare Disease
Follow us

| Edited By:

Updated on: Sep 15, 2019 | 10:01 AM

మన జానపద కథల్లో ఒంటి కన్ను లేదా ఒంటి కొమ్ము రాక్షసుల గురించి విన్నాం. నిజ జీవితంలో అటువంటి వారు ఎప్పుడూ మనకు తటస్థ పడలేదు కదూ..ఈ వార్త చూసిన వారెవరికైనా మనుషులకు కొమ్ములెట్లా మొలుస్తాయి అనే అనుమానం రావచ్చు. శ్యాం లాల్ యాదవ్ అనే ఈ వృద్ధుడి ఉదంతం తెలుసుకుంటే అది ఎలా సాధ్యమో అర్థమౌవుతుంది.

మధ్యప్రదేశ్‌లో 74 ఏళ్ల శ్యామ్‌లాల్ అనే ఓ వృద్దుడు అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. కొన్నేళ్ల క్రితం శ్యామ్‌లాల్ తలపై గాయం కాగా.. ఆ తర్వాత కొన్ని రోజులకు దాని స్థానంలో కొమ్ము లాంటి ఆకారం ఏర్పడింది.తలపై చర్మం పొడుగ్గా పెరిగి వికృతంగా కనిపించడం మొదలుపెట్టింది. దాంతో శ్యామ్‌లాల్ ఇంట్లోనే దాన్ని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండేవాడు. అయితే కట్ చేస్తున్నకొద్ది అది పెరుగుతూనే ఉండటంతో.. ఇటీవలే వైద్యులను సంప్రదించాడు.

భోపాల్‌లోని సాగర్ భాగ్యోదయ్ ఆస్పత్రి వైద్యులు శ్యామ్‌లాల్‌కు వైద్యం చేసి ఎట్టకేలకు దాన్ని తొలగించారు. దీంతో శ్యామ్‌లాల్‌కు ఉపశమనం లభించినట్టయింది. సాధారణంగా దీన్ని డెవిల్ హార్న్ అంటారని.. వైద్య పరిభాషలో సెబాసియస్ హార్న్ అంటారని వైద్యులు తెలిపారు. ఎండ వేడి తగిలే ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా ఏర్పడుతుందని చెప్పారు. మరోసారి అలాంటి హార్న్ రాకుండా సర్జరీ చేసి దాన్ని పూర్తిగా తొలగించామని చెప్పారు.ఈ సందర్భంగా శ్యాంలాల్‌కు శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు విశాల్ మాట్లాడుతూ.. ఇది అత్యంత అరుదైన ఆపరేషన్‌ అని తెలిపారు.  ఈ కేసు అరుదైనది కాబట్టి దీని వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ సైన్స్ లో ప్రచురణార్థం పంపిస్తామని వెల్లడించారు.