హైదరాబాద్‏లో దారుణం.. ఆడుకోవడానికి వెళ్ళిన నాలుగేళ్ళ చిన్నారిపై 50 ఏళ్ళ వ్యక్తి అఘాయిత్యం..

|

Dec 13, 2020 | 11:53 AM

హైదరాబాద్‏లో దారుణం చోటు చేసుకుంది. ఆడుకోవడానికి వెళ్ళిన నాలుగేళ్ళ చిన్నారిపై 50 ఏళ్ళ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్‏లో దారుణం.. ఆడుకోవడానికి వెళ్ళిన నాలుగేళ్ళ చిన్నారిపై 50 ఏళ్ళ వ్యక్తి అఘాయిత్యం..
Follow us on

హైదరాబాద్‏లో దారుణం చోటు చేసుకుంది. ఆడుకోవడానికి వెళ్ళిన నాలుగేళ్ళ చిన్నారిపై 50 ఏళ్ళ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒడిశాకు చెందిన దంపతులు హైదరాబాద్‏లోని ఫిలింనగర్‏లో నివసిస్తున్నారు. చుట్టు పక్కన ఉన్న ఇళ్ళలో పనిచేస్తూ నివసిస్తూంటారు. వారికి ముగ్గురు పిల్లలు. శుక్రవారం ఉదయం ఇళ్ళలో పనిచేసిన వచ్చిన తల్లికి కుమార్తె కనిపించలేదు. బాలిక కోసం వెతకగా పక్క ఇంటి నుంచి రావడం గమనించి ఎక్కడికెళ్ళావ్ అని అడగ్గా.. ఆడుకోవడానికి బొమ్మలు ఇస్తానని చెప్పి పక్కింటి వృద్దుడు తీసుకెళ్ళడానికి బాలిక రోదించింది. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తమ పక్కింట్లో ఉండే చెన్నయ్య (50) ఇంటికేళ్ళగా.. అతను ఇంటికి తాళం వేసి పారిపోయాడు. వెంటనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‏లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చెన్నయ్యపై ఐపీసీ సెక్షన్ 376 (ఎ) (బి), 363 ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బంజారా హిల్స్ ఎస్సై తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.