ఇది కదా లక్ అంటే.. ఏడాది బుడ్డోడికి ఏడు కోట్ల ప్రైజ్ మనీ!

కేరళకు చెందిన 11 నెలల శిశువు ఇప్పుడు యుఎఇలో కొత్త మల్టీ మిలియనీర్. నిండా ఏడాది వయసు కూడా లేని ఓ కేరళ చిన్నారి లక్కీడ్రాలో జాక్‌పాట్‌ కొట్టేసింది. దాదాపు రూ.7 కోట్లు గెలుచుకుంది. ‘దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ మిల్లెనియం మిలియనీర్‌’ పేరిట నిర్వహించిన డ్రాలో ఈ మొత్తం గెలుచుకుంది. మొహమ్మద్ సలాహ్‌ అనే 11 నెలల అబ్బాయి ఈ లాటరీ గెలుచుకున్నాడు. దీంతో ఒక మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.7 […]

ఇది కదా లక్ అంటే.. ఏడాది బుడ్డోడికి ఏడు కోట్ల ప్రైజ్ మనీ!

కేరళకు చెందిన 11 నెలల శిశువు ఇప్పుడు యుఎఇలో కొత్త మల్టీ మిలియనీర్. నిండా ఏడాది వయసు కూడా లేని ఓ కేరళ చిన్నారి లక్కీడ్రాలో జాక్‌పాట్‌ కొట్టేసింది. దాదాపు రూ.7 కోట్లు గెలుచుకుంది. ‘దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ మిల్లెనియం మిలియనీర్‌’ పేరిట నిర్వహించిన డ్రాలో ఈ మొత్తం గెలుచుకుంది. మొహమ్మద్ సలాహ్‌ అనే 11 నెలల అబ్బాయి ఈ లాటరీ గెలుచుకున్నాడు. దీంతో ఒక మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.7 కోట్లు)కు పైగా అతడి సొంతమయ్యాయి.

అబుదాబిలోని ఒక ప్రైవేట్ కంపెనీకి అకౌంటెంట్‌గా పనిచేస్తున్న అతని తండ్రి, 31 ఏళ్ల రమీస్ రెహ్మాన్, గత నెలలో ఆన్‌లైన్‌లో విన్నింగ్ టికెట్‌ను కొనుగోలు చేశానని చెప్పారు.“నేను నా కొడుకు పేరు మీద టికెట్ కొన్నాను. అతను చాలా అదృష్టవంతుడు. ఇది భారీ విజయం. డబ్బుతో ఏమి చేయాలో నేను ఇంకా నిర్ణయించుకోలేదు” అని సలాహ్‌ తండ్రి రమీజ్‌ రహ్మాన్‌ చెప్పుకొచ్చారు. కేరళకు చెందిన వీరు అబుదాబీలో గత ఆరేళ్లుగా నివసిస్తున్నారు. దుబాయి డ్యూటీ ఫ్రీ సంబరాల్లో ఏడాదిగా పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 13 నాటికి ఈ చిన్నారికి ఏడాది నిండుతుంది.

Published On - 4:47 am, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu