మళ్ళీ రసెల్ మోత… పంజాబ్ పై కోల్‌కత్తా విజయం

సొంతగడ్డపై కోల్‌కత్తా నైట్ రైడర్స్ వరసగా రెండో విజయం సాధించింది. బుధవారం ఈడెన్ గార్డెన్స్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 14 పరుగులు తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. మొదట్లో రాబిన్ ఉతప్ప (67 నాటౌట్; 50 బంతుల్లో), నితీష్ రాణా (63; 34 బంతుల్లో) మూడో వికెట్ కు 110 పరుగులు […]

మళ్ళీ రసెల్ మోత... పంజాబ్ పై కోల్‌కత్తా విజయం
Follow us

| Edited By: Vijay K

Updated on: Mar 28, 2019 | 7:04 PM

సొంతగడ్డపై కోల్‌కత్తా నైట్ రైడర్స్ వరసగా రెండో విజయం సాధించింది. బుధవారం ఈడెన్ గార్డెన్స్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 14 పరుగులు తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. మొదట్లో రాబిన్ ఉతప్ప (67 నాటౌట్; 50 బంతుల్లో), నితీష్ రాణా (63; 34 బంతుల్లో) మూడో వికెట్ కు 110 పరుగులు జోడించి భారీ స్కోర్ కు పునాది వేయగా.. చివర్లో వచ్చిన ఆండ్రీ రసెల్ (48; 17 బంతుల్లో) చెలరేగిపోయాడు. ఇక పంజాబ్ బౌలర్లలో టై, షమీ, చక్రవర్తిలు తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. మయాంక్ అగర్వాల్ (58; 34 బంతుల్లో), మిల్లర్ (59 నాటౌట్; 40 బంతుల్లో) అర్ధ సెంచరీలు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. కాగా పంజాబ్ పతనంలో కీలక పాత్ర వహించిన రసెల్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.