హైద‌రాబాద్‌లో మూడోద‌శ క‌రోనా చికిత్స కేంద్రం

తెలుగు రాష్ట్రాలను హ‌డ‌లెత్తిస్తున్న కోవిడ్-19 భూతం ప్ర‌స్తుతం రెండోద‌శ‌లో ఉంది. ప‌రిస్థితి విష‌మించి మూడో ద‌శ‌కు చేర‌కుండా ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఎక్క‌డైనా మూడోద‌శ కేసు..

హైద‌రాబాద్‌లో మూడోద‌శ క‌రోనా చికిత్స కేంద్రం
Follow us

|

Updated on: Mar 30, 2020 | 9:28 AM

కోవిడ్‌-19ః చైనాలోని వూహాన్‌ అనే నగరంలో డిసెంబర్‌లో కనుగొన్నారు. అక్కడి నుంచి కొన్ని వేల మందికి అంటుకుంది. తెలుగు రాష్ట్రాలను హ‌డ‌లెత్తిస్తున్న కోవిడ్-19 భూతం ప్ర‌స్తుతం రెండోద‌శ‌లో ఉంది. ప‌రిస్థితి విష‌మించి మూడో ద‌శ‌కు చేర‌కుండా ప్ర‌భుత్వం ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఎక్క‌డైనా మూడోద‌శ కేసు బ‌య‌ట‌ప‌డితే గ‌నుక చికిత్స కోసం ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం హైద‌రాబాద్‌లోని కింగ్‌కోఠి ఆస్ప‌త్రిలో ఏర్పాట్లు చేసిన‌ట్లుగా మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా…నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి దశలో విదేశాలకు వెళ్లివచ్చిన వారి ద్వారా వ్యాపిస్తుంది. రెండవ దశలో విదేశాలనుంచి వచ్చిన వారి ద్వారా స్థానికులకు వస్తుంది. మూడవ దశ స్థానికుల ద్వారా గ్రామం, లేదా పట్టణమంతా వ్యాప్తి చెందడం. 4వ దశలో మహమ్మరిగా మారి ప్రళయం సృష్టి స్తోంది. ఇప్పటికి 198 దేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిలో ఉంది. కాగా, మ‌న రాష్ట్రంలో కరోనా మూడోదశ చికిత్స కేంద్రంగా ప్రభుత్వం కింగ్‌కోఠి ఆస్పత్రిని తీర్చిదిద్దింది. 300 పడకలను ఐసోలేషన్‌కు, మరో 50 పడకలను ఐసీయూకు కేటాయించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇతర వ్యాధులతో చికిత్స పొందుతున్న రోగులను ఉస్మానియా, నిలోఫర్‌, సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రులకు తరలించారు.

వైద్యనిపుణులు అందుబాటులో ఉన్న కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిని పూర్తిస్థాయిలో కరోనా చికిత్సకు వినియోగించనున్నారు. ఇక్కడ ఇప్పటికే ఉన్న ఐదుగురు వైద్యనిపుణులకు తోడు.. 14 మంది అనస్థీషియా, పల్మనాలజి, జనరల్‌ ఫిజీషియన్‌ విభాగాల స్పెషలిస్టులను తాజాగా నియమించారు. వీరితోపాటు.. మరో 17 మంది వైద్యులు ఇక్కడ పనిచేస్తున్నారు.