Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

ఖమ్మం గ్యాంగ్ రేప్ కేసు: ఏడుగురు నిందితుల అరెస్ట్..

Tribal Woman Kidnapped and Gang-raped in Cotton Field in Telangana, ఖమ్మం గ్యాంగ్ రేప్ కేసు:  ఏడుగురు నిందితుల అరెస్ట్..
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఈ శుక్రవారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది.  వివాహితపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఒకరు అదే రోజు స్పాట్‌లో అదుపులోకి తీసుకోగా, మిగిలిన ఆరుగురుని ఆదివారం పట్టుకున్నారు.
ఏం జరిగిందంటే :
రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న మహిళలపై విరుచుకుపడ్డారు కామాంధులు. ఇంట్లోకి ప్రవేశించి, అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి..కాళ్లు, చేతులు కట్టేశారు. ఆపై బైక్‌పై హర్యాతండాలోని పత్తి చేనులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెను బలవంతంగా తీసుకువెళ్లడాన్ని గమనించిన పక్కింటి యువకుడు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెళ్లేసరికి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు.. అక్కడినుంచి పరారయ్యారు. బాధితురాలును ఆస్పత్రికి తరలించిన పోలీసులు..ఆమె వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు హర్యాతండాకు చెందిన బాణోతు ఉపేందర్‌, బాణోతు మోహన్‌, బాణోతు చంటి,  అంగోతు కల్యాణ్‌, అజ్మీరా నాగేశ్వరరావు.. సుకినీ తండాకు చెందిన మాలోతు అశోక్‌, బి. సునీల్‌‌లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరందర్నీ రహస్యంగా విచారిస్తున్నారు.

 

Related Tags