Breaking : కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసు ప్రధాన నిందితురాలు స్వప్న అరెస్ట్..

కేరళ‌లో బంగారం స్మ‌గ్లింగ్ కేసు క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ లక్ష్యంగా ప్రతిపక్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాయి

Breaking : కేరళ బంగారం స్మగ్లింగ్​ కేసు ప్రధాన నిందితురాలు స్వప్న అరెస్ట్..
Follow us

|

Updated on: Jul 11, 2020 | 9:50 PM

కేరళ‌లో బంగారం స్మ‌గ్లింగ్ కేసు క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ లక్ష్యంగా  ప్రతిపక్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాయి. దీంతో బంగారం అక్ర‌మ రవాణాపై నిష్పక్షిపాతంగా దర్యాప్తు జ‌రిపించాల్సిందిగా బుధవారం ప్రధానికి లేఖ రాశారు. ఈ క్రమంలో కేసు విచార‌ణ‌ను ఎన్ఐఏకు అప్పగించింది కేంద్ర ప్ర‌భుత్వం. దీంతో శుక్ర‌వారం రంగంలోకి దిగిన 24 గంటల్లోనే ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్​, మరో నిందితుడు సందీప్​ నాయర్​లను అరెస్టు అరెస్ట్ చేశారు ఎన్​ఐఏ అధికారులు. బంగారం అక్రమ రవాణా అంశాన్ని కేంద్రం తీవ్రంగా ప‌రిగ‌ణించింది. జాతీయ భద్రతకు ప్ర‌మాదం వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని భావించింది. అందుకే కేసు విచార‌ణ‌ను వేగ‌వ‌తం చేసింది.