Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • మర్డర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు. వెంకటేశ్వరరావు డిఎస్పి మిర్యాలగూడ.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • విశాఖ: డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్ పోలీస్ రోడ్ పై నిలబడి సేవచేయాలంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు విధినిర్బహణలో ఉన్నారు లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగాం -కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగాం వైరస్ పై ఇంకా అవగాహన పెరగాలి.. అందరూ మాస్క్ ధరించాలని చెబుతున్నాం.. అవగాహన పెంచుతున్నాం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

రియల్ పులితో ఎన్టీఆర్ ఫైట్.. వీడియో వైరల్!

Jr NTR Fight With Tiger, రియల్ పులితో ఎన్టీఆర్ ఫైట్.. వీడియో వైరల్!

డైరెక్టర్ రాజమౌళి తీస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రతీ అప్‌డేట్స్ ఈజీగా లీక్ అయిపోతున్నాయి. ఇంతకు ముందు వైజాగ్‌లో షూటింగ్‌లో ఎన్టీఆర్ లుక్స్, అలాగే ఓ ఫైట్ సీన్, ఓ సాంగ్‌ లీక్ అయ్యాయి. లీక్‌ చేసిన వారిపై చిత్ర బృందం కేసు కూడా పెట్టిందనుకోండి. అది వేరే విషయం కానీ.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నుంచి మరో సీన్ లీక్‌ అయ్యింది.

అదే.. అడవిలోని రియల్ పులితో, ఎన్టీఆర్ (కొమరం భీమ్) ఫైట్ సీన్. కొమరం భీమ్ అడవిలో వెళ్తుండగా.. అతనిపై ఓ పులి దాడి చేస్తుంది. ఈ భీకర పోరాటాన్ని ఇటీవలే ఎంతో ప్రయాస పడి చిత్రీకరించారు. ఇప్పుడు ఆ వీడియో కాస్త లీకవడం వల్ల చిత్ర యూనిట్ అప్రమత్తమైంది. ఆన్‌లైన్ నుంచి ఆ విజువల్‌ని తొలగించింది. అయితే నెటిజన్లు మాత్రం.. అందులో ఎన్టీఆర్ లుక్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో రాంచరణ్ సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఆలియా బట్, ఒలీవియా మెరిస్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది జులైలో విడుదల చేయనుంది చిత్ర బృందం.

Related Tags