బట్లర్‌ జెర్సీ @ 60 లక్షలు..!

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. న్యూజిలాండ్‌‌తో లార్డ్స్ వేదికగా జరిగిన ఐసీసీ ప్రపంచకప్‌ 2019 ఫైనల్‌లో తాను ధరించిన జెర్సీని ఇంగ్లండ్ వికెట్ కీపర్

  • Tv9 Telugu
  • Publish Date - 4:28 pm, Thu, 9 April 20

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. న్యూజిలాండ్‌‌తో లార్డ్స్ వేదికగా జరిగిన ఐసీసీ ప్రపంచకప్‌ 2019 ఫైనల్‌లో తాను ధరించిన జెర్సీని ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జాస్ బట్లర్ వేలంలో అమ్మేశాడు. తద్వారా వచ్చిన డబ్బుని అతను లండన్‌లో కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న రెండు ఆస్పత్రులకు విరాళంగా ఇచ్చాడు. ఈ-బే అనే ఈ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా బట్లర్ తన జెర్సీని వేలంలో ఉంచాడు.

కాగా.. మంగళవారం 7.30కి ఈ వేలం ముగిసేలోపు దాదాపు 82 మంది ఇందులో పాల్గొన్నారు. ఈ జెర్సీని 65,100 పౌండ్లకు (అంటే భారత నగదులో దాదాపు 62 లక్షలకు) వేలం పాడి ఓ వ్యక్తి సొంతం చేసుకన్నాడు. ఆ డబ్బుని లండన్‌లోని రాయల్ బ్రాంప్టన్ అండ్ హారేఫీల్డ్ ఆస్పత్రులకు అతను విరాళంగా ఇచ్చాడు. ఊపిరితిత్తులు మరియు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారికి ఇక్కడ చికిత్స అందిస్తారు. అయితే కరోనా వ్యాప్తి పెరిగిపోయిన నేపథ్యంలో ఈ ఆస్పత్రుల్లో ఆ వ్యాధికి సంబంధించిన చికిత్సను అందిస్తున్నారు.