షో ఆఫ్ అపోజిషన్ యూనిటీ… ఝార్ఖండ్ పీఠంపై హేమంత్ సొరేన్

చాలా కాలం తరువాత దేశంలో ప్రతిపక్షాల ‘ సమైక్యత ‘ కనిపించింది. ఝార్ఖండ్ రాష్ట్ర 11 వ ముఖ్యమంత్రిగా జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సొరేన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ద్రౌపది ముర్ము హేమంత్ చేత ప్రమాణం చేయించారు. ఆయన ఈ రాష్ట్ర సీఎం గా పదవి చేపట్టడం ఇది రెండో సారి. హేమంత్ తో బాటు మరో ఇద్దరు సభ్యులు మంత్రులుగా […]

షో ఆఫ్ అపోజిషన్ యూనిటీ...  ఝార్ఖండ్ పీఠంపై హేమంత్ సొరేన్
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 29, 2019 | 4:19 PM

చాలా కాలం తరువాత దేశంలో ప్రతిపక్షాల ‘ సమైక్యత ‘ కనిపించింది. ఝార్ఖండ్ రాష్ట్ర 11 వ ముఖ్యమంత్రిగా జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సొరేన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ద్రౌపది ముర్ము హేమంత్ చేత ప్రమాణం చేయించారు. ఆయన ఈ రాష్ట్ర సీఎం గా పదవి చేపట్టడం ఇది రెండో సారి. హేమంత్ తో బాటు మరో ఇద్దరు సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘేల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డీఎంకె అధినేత స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సీపీఎం, సీపీఐ నేతలు సీతారాం ఏచూరి, డి. రాజా. లోక్ తాంత్రిక్ జనతాదళ్ నాయకుడు శరద్ యాదవ్ తదితరులంతా హాజరయ్యారు. మాజీ సీఎం, బీజేపీ నేత రఘువర్ దాస్ కూడా ఈ ఈవెంట్ కు హాజరు కావడం విశేషం. రాష్ట్రంలో ఓ కొత్త శకానికి నాంది పలుకుతున్న ‘ సంకల్ప్ దివస్ ‘ గా ఈ రోజును నేతలు అభివర్ణించారు. అంతకు ముందు ఈ ఉదయం హేమంత్ సొరేన్.. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరు కావాలని ప్రజలను కోరుతూ ట్వీట్ చేశారు. ఇది చరిత్రాత్మక ఘటన అని పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి 47 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. (రాష్ట్ర అసెంబ్లీలో 81 మంది సభ్యులున్నారు). హేమంత్ సొరేన్ మళ్ళీ ఝార్ఖండ్ సీఎం గా అధికార పగ్గాలు చేబట్టడానికి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, టాటా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌తో బాటు క్రియేటివ్ సోషల్ మీడియా కూడా ఎంతగానో కృషి చేశాయి.

పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?