డిసెంబర్ 6 నుంచి జియో ఛార్జీల మోత..వాటి నుంచి ఇలా తప్పించుకోండి

జియో రేట్ల మోత మోగించేందుకు సిద్దమైంది. ఇటీవల ప్రీపెయిడ్ యూజర్స్‌కు అందిస్తోన్న మొబైల్ టారిఫ్‌లను పెంచబోతున్నట్లు కంపెనీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6 వ తేదీ నుంచి రిలయన్స్ జియో మొబైల్ సేవల రేట్లను 40% వరకు పెంచబోతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. 40 శాతం రేట్లను పెంచుతున్నప్పటికి 300 శాతం ఎక్కువ ప్రయోజనాలను ఇవబోతున్నట్లు సంస్థ తెలిపింది. అయితే జియో రిఛార్జ్ ఇన్ అడ్వాన్స్ అనే అప్షన్‌ను తమ […]

డిసెంబర్ 6 నుంచి జియో ఛార్జీల మోత..వాటి నుంచి ఇలా తప్పించుకోండి
Follow us

|

Updated on: Dec 02, 2019 | 5:45 PM

జియో రేట్ల మోత మోగించేందుకు సిద్దమైంది. ఇటీవల ప్రీపెయిడ్ యూజర్స్‌కు అందిస్తోన్న మొబైల్ టారిఫ్‌లను పెంచబోతున్నట్లు కంపెనీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6 వ తేదీ నుంచి రిలయన్స్ జియో మొబైల్ సేవల రేట్లను 40% వరకు పెంచబోతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. 40 శాతం రేట్లను పెంచుతున్నప్పటికి 300 శాతం ఎక్కువ ప్రయోజనాలను ఇవబోతున్నట్లు సంస్థ తెలిపింది.

అయితే జియో రిఛార్జ్ ఇన్ అడ్వాన్స్ అనే అప్షన్‌ను తమ కష్టమర్లకు అందించబోతుంది. అంటే జియో యూజర్స్ వారికి  నచ్చిన ప్లాన్ ఏదైనా ఉంటే దాన్ని ఇప్పుడే రీఛార్జ్ చేయించుకోవచ్చు. అది హోల్డ్‌లో ఉంటుంది. ప్రజంట్ ఉన్న ప్లాన్ అయిపోయిన వెంటనే హోల్డ్‌లో ఉన్న ప్లాన్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. ప్రభుత్వ విధానాలు మారుతుండటంతో, టెలికాం కంపెనీలు తమపై భారాన్ని తగ్గించుకునేందుకు సిండికేట్‌గా మారి ఒకేసారి రేట్లను పెంచుతున్నాయి. ఎయిర్‌టెల్‌తో పాటు వోడాఫోన్ ఐడియా కంపెనీలు కూడా టారిఫ్ ధరలను పెంచాయి. పెరిగిన టారిఫ్ చార్జీలు డిసెంబర్ 3 (సోమవారం అర్థరాత్రి) నుంచి అమల్లోకి రానున్నాయి.