జగన్‌ పరిపాలనకు 100కు 100 మార్కులు వేస్తానన్న జేసీ

JC Diwakar Reddy Interesting Comments on AP CM Jagan, జగన్‌ పరిపాలనకు 100కు 100 మార్కులు వేస్తానన్న జేసీ

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. ఏపీ సీఎం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ పరిపాలనకు 100కు 100 మార్కులు వేస్తా అన్నారు. జగన్‌ విపక్షంలో ఉన్నా… సీఎంగా ఉన్నా.. మా వాడే అని మీడియా ముందు బహిర్గంతంగా చెప్పారు. ‘జగన్‌.. కిందా మీదా పడుతున్నాడని.. అతన్ని చేయి పట్టి నడిపించేవాడు కావాలన్నారు. జగన్‌కి దిశానిర్ధేశం చేయాలనే కానీ.. మంచి పనులు చేస్తారన్నారు. జగన్‌కి కావాలంటే.. మా సలహాలు ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చారు. అయినా.. ఒకవేళ వాళ్లు మమ్మల్ని అడిగితే.. తప్పకుండా వెళతా.. పిలవకుండా వెళితే.. ఎవరు రమ్మన్నారంటారు.. అని కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేశారు. అలాగే.. రాజధాని అమరావతిలోనే ఉంటుంది. అయినా.. మా వాడు.. తెలివి తక్కువ వాడేంకాదంటూ.. జగన్‌ని ఒక్కసారిగా పైకి ఎత్తేశారు.

అలాగే.. రాష్ట్రానికి.. ప్రజలకు మంచి చేయడానికి జగన్ చాలా కష్టపడుతున్నాడని.. అది అతని మొఖంలో కనిపిస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగుల విలీనం భారం అవుతోందని.. ఏ సర్కార్ చేయని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని.. జగన్‌ను పొగడ్తలతో ముంచేశారు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *