Breaking: తమిళనాడులో జనతా కర్ఫ్యూ పెంపు.. ఎప్పటివరకంటే..!

కరోనా మహమ్మారి విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని మోదీ ఇవాళ జనతా కర్ప్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనికి మద్దతు తెలుపుతూ.. ఆదివారం ఉదయం నుంచి ఇండ్లకు పరిమితమయ్యారు దేశ ప్రజలు

Breaking: తమిళనాడులో జనతా కర్ఫ్యూ పెంపు.. ఎప్పటివరకంటే..!
Follow us

| Edited By:

Updated on: Mar 22, 2020 | 3:30 PM

కరోనా మహమ్మారి విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని మోదీ ఇవాళ జనతా కర్ప్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనికి మద్దతు తెలుపుతూ.. ఆదివారం ఉదయం నుంచి ఇండ్లకు పరిమితమయ్యారు దేశ ప్రజలు. కాగా కరోనా ప్రభావం ఇంకా పెరుగుతోన్న నేపథ్యంలో ఈ కర్ఫ్యూను పెంచాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. రేపు ఉదయం 5 గంటల వరకు జనతా కర్ఫ్యూను పెంచుతున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా 24గంటల జనతా కర్ఫ్యూను విధించిన విషయం తెలిసిందే. అలాగే విజయవాడలోనూ మరో రెండు, మూడు రోజులు జనతా కర్ఫ్యూను కొనసాగించాలని సీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. దీనికి అందరూ సహకరించి.. స్వచ్చందంగా ఎవరి ఇళ్లలో వారే ఉండాలని తెలిపారు. అంతేకాదు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా జనతా కర్ఫ్యూ పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మార్చి 31వరకు కర్ఫ్యూను ప్రకటించిన సీఎం.. ఇతర రాష్ట్రాల నుంచి పుదుచ్చేరికి వచ్చే అన్ని మార్గాలు మూసివేయనున్నట్లు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల వాహనాల అనుమతికి నిరాకరించారు. అయితే పుదుచ్చేరి- తమిళనాడు సరిహద్దు గ్రామాలకు వెసులుబాటు కల్పించారు.

Read This Story Also: దేశంలో మరో కరోనా డెత్.. తెలంగాణలో 22కు చేరిన పాజిటివ్ కేసులు