ఇసుక కోసం సేనాని కవాతు..ఇసుకేస్తే రాలని జనం

ఏపీలో ఇసుక కొరతపై జనసేన పార్టీ నేడు లాంగ్ మార్చ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే కవాతు ప్రారంభమైంది. కాగా ఈ లాంగ్ మార్చ్‌కి కలిసిరావాలని ఏపీలోని ఇతర విపక్ష పార్టీలకు పవన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  టీడీపీ నుంచి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు కవాతులో పాల్గొంటున్నారు. ఆందోళనకు సంఘీభావాన్ని ప్రకటించినా..తమ పార్టీల ప్రతినిధులెవరూ ఇందులో పాల్గొనబోరని బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం తెలిపాయి. లోక్‌సత్తా నేత బీశెట్టి బాబ్జీ ఆ పార్టీ […]

ఇసుక కోసం సేనాని కవాతు..ఇసుకేస్తే రాలని జనం
Follow us

|

Updated on: Nov 03, 2019 | 5:14 PM

ఏపీలో ఇసుక కొరతపై జనసేన పార్టీ నేడు లాంగ్ మార్చ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే కవాతు ప్రారంభమైంది. కాగా ఈ లాంగ్ మార్చ్‌కి కలిసిరావాలని ఏపీలోని ఇతర విపక్ష పార్టీలకు పవన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  టీడీపీ నుంచి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు కవాతులో పాల్గొంటున్నారు. ఆందోళనకు సంఘీభావాన్ని ప్రకటించినా..తమ పార్టీల ప్రతినిధులెవరూ ఇందులో పాల్గొనబోరని బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం తెలిపాయి. లోక్‌సత్తా నేత బీశెట్టి బాబ్జీ ఆ పార్టీ తరఫున పాల్గొననున్నారు. వీరంతా కలిసి విశాఖలోని మద్దిలపాలెంలో ఉన్న తెలుగుతల్లి విగ్రహం నుంచి బయలుదేరి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా మార్చ్ చేయబోతున్నారు.

గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల నిర్మాణాలు నిలిచిపోవడంతో పనుల్లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని… ప్రభుత్వ విధానాల వల్లే ఇసుక కొరత ఏర్పడిందని పవన్ గత కొంతకాలంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కాగా కవాతు అనంతరం పవన్ బహిరంగసభలో ప్రసంగించనున్నారు.  ఇప్పటికే భారీగా పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు భారీగా కవాతులో పాల్గున్నారు. ఎక్కడ చూసిన పవన్ నినాదాలతో విశాఖ వీధులు హోరెత్తుతున్నాయి. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ పార్టీ చేస్తున్న పెద్ద నిరసన కార్యక్రమం కావడంతో పార్టీ వర్గాలు కూడా కవాతును ప్రస్టేజ్‌గా తీసుకున్నాయి. కాగా జనసేన లాంగ్ మార్చ్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండున్నర కిలోమీటర్లలో ఎక్కడికక్కడ పహారా కాస్తూ..డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెడుతున్నారు.

రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త