సరిహద్దులో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట ఉగ్రవాదుల కదలికలు కన్పిస్తూనే ఉన్నాయి. దీంతో సైన్యం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. ఉగ్రవాదుల కోసం లోయను జల్లెడపడుతోంది. తాజాగా..

సరిహద్దులో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2020 | 1:11 PM

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట ఉగ్రవాదుల కదలికలు కన్పిస్తూనే ఉన్నాయి. దీంతో సైన్యం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. ఉగ్రవాదుల కోసం లోయను జల్లెడపడుతోంది. తాజాగా నార్త్ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. హంద్వారాలోని నౌగామ్‌ సెక్టార్‌ వద్ద ఇద్దరు ఉగ్రవాదుల కదలికలను సైన్యం గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదుల్ని కాల్చి చంపేశాయి.ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సరిహద్దుల వద్ద ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల్ని సైన్యం గుర్తించిందని.. ఈ క్రమంలోనే వారిపై కాల్పులు జరిపాయని ఆర్మీ పీఆర్వో ప్రకటించింది. ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాల వద్ద రెండు ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నామని.. పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రి కూడా ఉందని ఆర్మీ పేర్కొంది. అయితే సరిహద్దు వద్ద మరికొంత మంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోందని.. వీరంతా పాక్‌ నుంచి సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్నారని.. కొంత మంది సరిహద్దు దాటి పలు ప్రాంతాల్లో దాక్కున్నారని ఆర్మీ అధికారులు తెలిపారు. వారి కోసం కూంబింగ్ చేపడుతున్నామన్నారు.