రోగిని చితక్కొట్టిన వైద్యుడు.. వీడియో వైరల్

రాజస్థాన్‌లోని సవాయి‌మన్ సింగ్ మెడికల్ హాస్పిటల్‌లోని ఓ డాక్టర్ వైద్యం కోసం వచ్చిన పేషెంట్‌ను చితకబాదిన ఉదంతం సంచలనమైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే రోగిని చితకబాదిన వైద్యుని పేరు సునీల్ అని తెలుస్తోంది. ఆయన వార్డు నంబర్ 1 సీ లోని రోగిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఏదో విషయమై డాక్టర్‌కు, ఆ రోగి బంధువులకు మధ్య వాగ్వాదం జరగడంతోనే .. డాక్టర్ సునీల్ ఆ రోగిపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా దీనిపై రాజస్థాన్ మానవ హక్కుల కమీషన్ విచారణకు ఆదేశించగా.. అటు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కూడా ఈ ఘటన పై వివరణ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *