కరోనా కాలంలో పేదల కోసం జగన్ మరో సంచలన నిర్ణయం..!

ఓ వైపు కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు

కరోనా కాలంలో పేదల కోసం జగన్ మరో సంచలన నిర్ణయం..!
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2020 | 10:03 PM

ఓ వైపు కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎల్‌ఐసీ బీమా క్లైయిములు మంజూరు చేయకున్నా.. ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటాను వెంటనే చల్లించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. గడిచిన నవంబర్ నుంచి పరిష్కారం కాని క్లైయిముల కుటుంబాలకు వెంటనే చెల్లింపులు చేయాలని.. శనివారం నుంచే డబ్బులను ఆయా కుటుంబాలకు చెల్లించాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

కాగా ఈఎస్‌ఐ, పీఎఫ్‌ లాంటి సదుపాయాల్లేని వారు సహజ మరణం చెందినా, లేక ప్రమాదవశాత్తూ మరణించినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్‌ఐసీతో కలిసి బాధితులకు బీమాను అందిస్తూ వచ్చేవి. కానీ గడిచిన నవంబర్ నుంచి ఈ క్లైయిముల పరిష్కారం నిలిచిపోయింది. దీనిపై జగన్ పలుమార్లు మోదీకి లేఖ కూడా రాశారు. వాటిపై స్పందించిన మోదీ, ఎల్‌ఐసీకి లేఖ రాశారు. అయినా ఇప్పటివరకు క్లైయిమ్‌లను మంజూరు అవ్వలేదు. ఈ నేపథ్యంలో జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా సుమారు రూ.400కోట్లు బాధిత కుటుంబాలకు ఇవ్వాలని భావించారు. ఒకవేళ బీమా సంస్థ ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించకపోతే.. ఆ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Read This Story Also: ర్యాపిడ్ కిట్లతో కరోనా పరీక్ష చేయించుకున్న సీఎం జగన్..!

Latest Articles